దేవిశ్రీ‌ని ఎందుకు ప‌క్క‌న పెడుతున్న‌ట్టు?

త్రివిక్ర‌మ్ – దేవిశ్రీ ప్ర‌సాద్‌ల‌ది సూప‌ర్ హిట్ కాంబో. జ‌ల్సా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ స‌త్య‌మూర్తి… ఇలా నాన్ స్టాప్ గా సాగింది వీళ్ల ప్ర‌యాణం. ఈ సినిమాల‌న్నీ హిట్టే. పాట‌లు అదిరిపోతాయి. కానీ.. ‘అ.ఆ’ నుంచి త్రివిక్ర‌మ్ ఆలోచ‌న మారింది. ఆ సినిమాకి సంగీత ద‌ర్శ‌కుడిగా మిక్కీని ఎంచుకొని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు త్రివిక్ర‌మ్‌. ‘చిన్న సినిమా క‌దా, పైగా ఫ్రెష్ ఫీల్ కోసం తీస్తున్నాడు.. అందుకే దేవిని తీసుకోలేదేమో’ అనిపించింది. ఆ త‌ర‌వాతి సినిమా `అజ్ఞాత వాసి`కీ దేవిని ప‌క్క‌న పెట్టేశాడు త్రివిక్ర‌మ్‌. ఆయ‌న నిర్ణ‌యాన్ని జీర్ణం చేసుకోవ‌డానికి అభిమానుల‌కు కొంత‌కాలం ప‌ట్టింది. ‘ఇంటికొచ్చి చూస్తే.. టైమేమో..’ అనే ఒకే ఒక్క పాట‌తో ప‌వ‌న్ ఫ్యాన్స్‌ని సంతృప్తి ప‌రిచేశాడు అనిరుధ్‌. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకీ… అనిరుధ్ టీమ్‌లోకి వ‌చ్చేశాడు. దాంతో త్రివిక్ర‌మ్ – దేవిల మ‌ధ్య గ్యాప్ అలా కొన‌సాగుతూనే ఉంది.

వ‌రుస‌గా మూడో సినిమాకీ దేవిని ప‌క్క‌న పెట్ట‌డంతో… సాధార‌ణంగానే గాసిప్పుల‌కు దారి దొరికిన‌ట్టైంది. ‘త్రివిక్ర‌మ్‌, దేవిల మ‌ధ్య ఏదో జ‌రిగింది.. అందుకే… ఈ దూరం’ అంటూ గాసిప్పులు షికారు చేయ‌డం మొద‌లెట్టాయి. కానీ… త్రివిక్ర‌మ్ స‌న్నిహితులు మాత్రం అలాంటిదేం జ‌ర‌గ‌లేదంటున్నారు. ”ఒకే టీమ్‌తో ప‌నిచేయ‌డం ఏ ద‌ర్శ‌కుడికైనా కాస్త క‌ష్ట‌మే. మ‌ధ్య‌మ‌ధ్య‌లో… మార్పులూ చేర్పులూ ఉంటాయి. త‌న క‌థ‌కి త‌గ్గ‌ట్టుగానే త్రివిక్ర‌మ్ సంగీత ద‌ర్శ‌కుల్ని ఎంచుకొంటార‌”ని తేల్చేశారు. అంతేకాదు… దేవి, త్రివిక్ర‌మ్ ఇప్ప‌టికీ ట‌చ్‌లోనే ఉంటున్నార్ట‌. సో… ఈ ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లేం లేవ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.