ఏం జరిగినా ఇప్పుడే ఎన్నికలు..! వైసీపీ హడావుడి దేనికి..?

కరోనా మహమ్మారిలా ప్రపంచంపై దాడి చేస్తోంది. అక్కడా ఇక్కడా అనే తేడా లేదు.. మొత్తం విస్తరించేసింది. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే.. మానవాళి మనుగడే ముప్పు అని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ దగ్గర్నుంచి.. కేంద్ర ప్రభుత్వం వరకు.. విపత్తుగా ప్రకటించేశాయి. స్కూళ్లు, కాలేజీలు, షాపింగ్ మాల్స్ ఇలా జనం గుమికూడే ఎలాంటి కార్యకలాపాలు వద్దని ఆదేశాలిచ్చాయి. కానీ అన్నింటి కన్నా భిన్నంగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ మాత్రం.. కరోనా అసలు ప్రమాదకారి కానే కాదని వాదిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను.. కరోనా కారణంగా ఎస్‌ఈసీ వాయిదా వేయడాన్ని తప్పు పడుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిందేనని.. పట్టుబడుతోంది. దాని కోసం అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తోంది. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.. పార్లమెంట్‌లోనూ ఆ పార్టీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ప్రస్తావించారు. గుడ్ న్యూస్ వస్తుందని.. ఆ పార్టీ నేతలు.. ఎన్నికల సన్నాహాల్లోనే ఉన్నారు.

ఆర్థిక సంఘం నిధులు ఎక్కడికీ పోవు..! ఆలస్యమైనా వస్తాయి..!

ప్రజారోగ్యాన్ని లెక్కలోకి తీసుకోకుండా.. అధికార పార్టీ ఎన్నికలను ఇప్పుడే నిర్వహించాలని పట్టుబడుతోంది. దానికి… పధ్నాలుగో ఆర్థిక సంఘం నిధులను కారణంగా చూపిస్తోంది. నెలాఖరులోపు ఎన్నికలు జరగకపోతే.. ఐదు వేల కోట్లు రావని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే.. అది తప్పుడు ప్రచారమని.. మాజీ ఆర్థిక మంత్రి యనమల స్పష్టం చేశారు. కేంద్రానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తే గతంలో నిధులు వచ్చిన సందర్భాలు ఉన్నాయన్నారు. సీఎస్ నీలం సహాని రాసిన లేఖకు సమాధానం ఇచ్చిన ఎస్‌ఈసీ రమేష్ కుమార్ కూడా.. ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తాను గతంలో ఆర్థిక శాఖలో ఉన్నతాధికారిగా పని చేశానని..ఆర్థిక సంఘం నిధుల వ్యవహారాలను చూశానని.. ఎన్నికలు జరగాలనేది.. ఒక నిబంధన కానీ.. అది ఒక్కటే నిబంధనకాదని స్పష్టం చేశారు. ఎన్నికలు జరగకపోయినా.. కేంద్రం నిధులు ఇచ్చిన పలు సందర్భాలు ఉన్నాయన్నారు. అంతే కాకుండా.. ప్రభుత్వానికి నిధులే సమస్య అయితే.. పది నెలల కాలంలో ఎందుకు నిర్వహించడానికి ఆసక్తి చూపలేదనే ప్రశ్న సహజంగానే వస్తుంది..

ఇవాళ కాకపోతే.. రేపైనా ఎన్నికలు జరగాల్సిందే కదా..!

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరగాల్సిందేనని.. అధికార పార్టీ పట్టుబట్టడం వెనుక ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అయినా రాజకీయ లక్ష్యాలను సాధించాలన్న పట్టుదలను ప్రదర్శిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే అన్ని రకాల వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని పాతిక శాతం స్థానిక సంస్థల సీట్లను ఏకగ్రీవం చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. మిగిలిన వాటిలోనూ అదే పద్దతి పాటించి. ఎన్నికలను స్వీప్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారని.. అందుకే వాయిదా పడటంపై.. అధికారపార్టీకి అసహనం కలుగుతోందని అంటున్నారు. అదే సమయంలో… ఇవాళ కాకపోతే.. రేపైనా ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా కరోనాను ప్రకటించింది. ఆ ప్రకటన ఉపసంహరించుకున్న తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ విషయం అధికార పార్టీకి తెలియకేం కాదు. కానీ అప్పుడు జరిగితే.. ఏదో మునిగిపోతుందన్న ఆందోళన.. ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది.

రెండు, మూడు నెలల తర్వాత జరిగితే ప్రజలు ఓట్లేయరా..?

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉండటం వల్ల.. వచ్చే ఏడాది నవరత్నాల హామీలను అమలు చేయడం.. సాధ్యం కాదన్న అభిప్రాయంతో.. ఉండవచ్చని అంటున్నారు. అదే జరిగితే.. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని.. ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. కరోనా ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ మరింత కుంగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీ తిరోగమన దిశలో ఉంది. ఇప్పుడు మరిన్ని కష్టాల్లో పడితే.. ప్రభుత్వ నిర్వహణే కష్టమయ్యే సూచనలు ఉంటాయంటున్నారు. ఎంత ఆలస్యమైతే అంత ప్రజావ్యతిరేకత పెరుగుతుందని.. ఎంత త్వరగా ఎన్నికలు జరిగితే.. అంత మంచిదని అధికార పార్టీ భావిస్తున్నట్లుగా అర్థం చేసుకోవచ్చంటున్నారు..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close