వైల్డ్ డాగ్ ట్రైల‌ర్‌: నాగ్ @ యాక్ష‌న్ మోడ్‌

నాగార్జున అంటే.. రొమాంటిక్ పాత్ర‌లు, మ‌న్మ‌థుడు లాంటి ఇమేజ్ గుర్తొస్తుంది. ఆయ‌న యాక్ష‌న్ బ‌రిలోకి దిగి.. చాలాకాలం అయ్యింది. ఇన్నాళ్ల‌కు నాగ్ మ‌ళ్లీ యాక్ష‌న్ మోడ్‌లోకి వ‌చ్చాడు. `వైల్డ్ డాగ్‌` సినిమాతో. సాల్మ‌న్ ద‌ర్శ‌కుడు. ఏప్రిల్ 2న విడుద‌ల అవుతోంది. ఇప్పుడు ట్రైల‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

హైద‌రాబాద్‌లో జ‌రిగిన వ‌రుస బాంబు పేలుడు ఘ‌‌ట‌న గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ క‌థా నేప‌థ్యం కూడా అదే. హైద‌రాబాద్ లో జ‌రిగిన పేలుళ్ల‌కు కార‌ణ‌మైన పాకిస్థానీ టెర్ర‌రిస్టుల్ని ప‌ట్టుకోవ‌డ‌మే.. వైల్డ్ డాగ్ ప్ర‌య‌త్నం. విజ‌య్ వ‌ర్మ అనే క‌మెండో.. తాను చేసే ఆప‌రేష‌న్‌… ఇదే క‌థ‌. 2 నిమిషాల 24 సెక‌న్ల పాటు సాగే ఈ ట్రైల‌ర్ లో మొత్తం యాక్ష‌న్ క‌ట్సే. బుల్లెట్ చ‌ప్పుళ్లూ, ప‌రుగులే.

విజ‌య్ వ‌ర్మ‌గా నాగార్జున న‌టించారు. త‌న గ్యాంగ్ ముద్దు పేరు వైల్డ్ డాగ్‌. ఎవ‌రైనా టెర్ర‌రిస్టు దొరికితే.. అరెస్ట్ చేసుకోవ‌డం ఏమీ ఉండ‌దు. డైరెక్ట్ గా పైలోకాల‌కు పంప‌డ‌మే. మేకింగ్‌లో క్వాలిటీ క‌నిపించింది. నాగ్.. ఆధ్యంతం సీరియ‌స్ లుక్‌లోనే క‌నిపించారు. టెర్ర‌రిస్టు వేట‌.. థ్రిల్లింగ్ గానే సాగి ఉంటుంద‌ని ట్రైల‌ర్‌లో అర్థం అవుతోంది. దేశ‌భ‌క్తికి సంబంధించిన డైలాగులూ.. ట్రైల‌ర్‌లో వినిపించాయి. మొత్తానికి.. ఇదో మంచి యాక్ష‌న్ మూవీ అయ్యే అవ‌కాశం వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close