ప్రొ.నాగేశ్వర్ : పౌరసత్వం అంశంతో రాహల్‌పై బీజేపీ మానసిక దాడి చేస్తోందా..?

రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం ఉందని వచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలంటూ.. కేంద్ర హోంశాఖ నోటీసులు జారీ చేసింది. బీజేపీ… ఈ తరహా ఆరోపణలు చేయడం.. ఇదే మొదటి సారి కాదు. ఓ సారి సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ కోర్టు కొట్టి వేసింది. ఆ తర్వాత లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. మొన్న అమేథీలో నామినేషన్ వేసే సమయంలోనూ.. ఓ స్వతంత్ర అభ్యర్థితో.. ఇలాంటి ఆరోపణలు చేయించి.. నామినేషన్‌ను పెండింగ్‌లో పెట్టారు. ఆ తర్వాత ఆమోదించారు. అంటే.. అదే పనిగా ఈ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.

రాహుల్‌కు భారతీయ పౌరసత్వం లేకపోతే ఐదేళ్లుగా కేంద్రం ఏం చేస్తోంది..?

రాహుల్ గాంధీ భారతీయ పౌరుడు కాకపోతే… వయనాడ్, అమేథీల్లో నామినేషన్లు ఆమోదించిన రిటర్నింగ్ ఆఫీసర్లను సస్పెండ్ చేయాలి. రాహుల్ ఇక్కడ.. మొదటి నుంచి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పౌరసత్వమే లేకపోతే.. ఓటు హక్కు ఎలా ఉంటుంది..? పౌరసత్వమే లేదంటున్న… బీజేపీ నేతలు.. ఎందుకు… ఓటు హక్కు ఉందని ప్రశ్నించడం లేదు. ఐదేళ్ల వరకూ… బీజేపీ అధికారంలో ఉంది. పౌరసత్వ వ్యవహారాల్ని చూసే హోంమంత్రిత్వ శాఖ.. ఈ విషయాన్ని ఎందుకు బయటకు తీయలేదు. భారత పౌరసత్వం లేని వ్యక్తి ఎంపీగా ఎందుకున్నారో ఎందుకు బయటపెట్టలేకపోయారు…?. రాహుల్‌కు నిజంగా పౌరసత్వం లేదంటే.. అది కచ్చితంగా… ప్రభుత్వ వైఫల్యమే. ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. పదిహేను రోజుల గడువు ఇచ్చారు. ఎన్నికలు జరుగుతున్నాయి… కాబట్టి ఈ హడావుడి. ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక్కరంటే.. ఒక్కరు కూడా.. ఈ అంశం గురించి మాట్లాడరు.

ఇలా ఎమోషనల్ ఎటాక్స్ చేయడం బీజేపీ స్ట్లైల్..! ఎన్నికల తర్వాత మాట్లాడరు..!

ఆరు నెలల క్రితం… ప్రధానమంత్రి నరేంద్రమోడీపై హత్యాయత్నం జరిగిందని హడావుడి చేశారు. కానీ ఇంత వరకూ ఒక్క ఎఫ్‌ఐఆర్‌ కూడా దాఖలు చేయలేదు. ఇప్పుడెవరూ దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు..?. అంతకు ముందు… మన్మోహన్ సింగ్ .. పాకిస్థాన్‌తో కలిసి నన్ను చంపించడానికి ప్రయత్నిచారని మోడీ ఎన్నికల సభల్లో ఆరోపిచారు. దీనిపై కాంగ్రెస్ నేతలు లోక్‌సభలో గొడవ చేశారు. అప్పుడు… తమకు అలాంటి అభిప్రాయం లేదని ప్రభుత్వం చెప్పింది. మన్మోహన్ సింగ్ దేశభక్తిని తాను ఏనాడూ శంకించలేదని.. చెప్పుకొచ్చారు. ఎన్నికల తర్వాత అలాంటి ప్రస్తావనే ఉండదు. ఇదంతా.. ఓ జుమ్లా. బీమాకోరేగావ్ గొడవల వ్యవహారం.. చివరికి మోడీపై హత్యకు కుట్ర అన్నట్లుగా మార్చేశారు. దళితులపై అక్కడ దాడులు జరగడతంతో.. ఆ వర్గంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చివరికి ఇలా మార్చడంతో.. మోడీపై హత్యాయత్నం అనే అంశాన్ని వెనక్కి తగ్గించారు. ఇప్పటి వరకూ దానిపై.. ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. ప్రధానిపై హత్యాయత్నం జరిగితే… ఎన్‌ఐఏకి ఇవ్వరా.. ? జగన్ పై … కోడికత్తితో దాడి జరిగితే.. ఎన్ఐఏ విచారణ జరిపింది. ప్రధానిపై హత్యాయత్నం జరిగితే.. ఎన్ఐఏ ఎందుకు విచారణ చేయలేదు..? అంతే.. కాదు ఇప్పుడా విషయాన్ని బయటకు లేవనత్తడం లేదు. మోడీ, షా నోటి నుంచి ఒక్క మాట కూడా బయటకు రాలేదు.

ఎదురుదాడిలో బీజేపీ ఫస్ట్… ఎదుర్కోవడంలో కాంగ్రెస్ లాస్ట్..!

తాను చౌకీదార్‌నని… నరేంద్రమోదీ ప్రచారం చేసుకుంటున్నారు. దానికి కౌంటర్ గా .. రాహుల్ గాంధీ.. చౌకీదార్ చోర్ హై అనే ప్రచారాన్ని చేస్తున్నారు. ఈ ప్రచారం చాలా ఉద్ధృతంగా సాగుతోంది. ఎవరైనా చౌకీదార్ అంటే… చోర్ హై అనే నినాదాలు హోరెత్తే పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో… రాహుల్ గాంధీని నిలువరించాలంటే… ఆయనపై ఓ ఎమోషనల్ దాడి చేయాలి. దానికి బీజేపీ ఎంచుకున్న మార్గమే.. పౌరసత్వ వివాదం. జవహర్‌ లాల్ నెహ్రూ మునిమనవడు, ఇందిరాగాంధీ మనవడు, రాజీవ్ గాంధీ కొడుకును… భారతదేశ పౌరుడు కాదంటున్న విషయాన్ని రాహుల్ గాంధీ.. ఎమోషనల్ గా… ప్రజల్లోకి తీసుకెళ్లే్ అవకాశం ఉంది. రాహుల్ గాంధీ నిజంగా… బ్రిటన్ పౌరసత్వం తీసుకున్నా… భారతీయుడు కాదంటే.. నమ్మరు. కానీ కాంగ్రెస్ ఆ పని చేయలేకపోతోంది. తాను చౌకీదార్‌నని… మోదీ అంటే… చౌకీదార్ చోర్ హై అనే నినాదాన్ని రాహుల్ అందుకున్నారు. వెంటనే .. మోడీ.. బీజేపీ నేతలందరి పేర్ల ముందు చౌకీదార్ చేర్చారు. ఇలా.. ఎదురుదాడి చేయడంలో.. బీజేపీకి సామర్థ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీకి లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.