చంద్రబాబు, పవన్ భేటీలతో ఏపీలో రాజకీయ పొత్తులపై ఓ క్లారిటీ వస్తోంది. ఇప్పుడు అందరి చూపు బీజేపీ వైపు పడుతోంది. నిజానికి బీజేపీకి ఏపీలో ఓటు బ్యాంక్ లేదు. కానీ అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తారని.. రక్తపాతం సృష్టిస్తారని ఇలాంటి పరిస్థితులు ఉండకూడదంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కీలకం అని ఎక్కువ మంది భావిస్తున్నారు. ప్రస్తుతం .. ప్రతిపక్షాలన్నింటినీ కట్టడి చేసి.. ఒక్క వైసీపీ నేతలే రోడ్లపై ర్యాలీలు నిర్వహిస్తున్న పరిస్థితులు కళ్ల ముందే ఉన్నాయి. ముందు ముందు ఎంత దారుణంగా ఉంటుందో చెప్పడం కష్టం.
అందుకే బీజేపీని కూడా కలుపుకుంటామని జనసేన అధినేత చెబుతున్నారు. ఏపీ బీజేపీ నేతల ముందు కూడా ఇప్పుడు చాయిస్ వైసీపీ.. టీడీపీ మాత్రమే ఉన్నాయి. జనసేన పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేయడం వల్ల.. జగన్ కే లాభం అని తేలిపోయింది. అందుకే పవన్ వెనక్కి వెళ్లిపోతున్నారు. బీజేపీ ఒంటరి అయిపోయింది. ఇప్పుడు వైసీపీతో కలవాలా.. టీడీపీతోనే అన్న అంశంపై బీజేపీనే తేల్చుకోవాల్సి ఉంది. పార్టీ హైకమాండ్ కూడా ఈ అంశంపై దృష్టి పెట్టిందో లేదో తెలియాల్సి ఉంది.
వైసీపీతో బీజేపీకి డైరక్ట్ రిలేషన్ ఉండదు. పరోక్ష పొత్తులే పెట్టుకోవాలి. అంటే బీజేపీతో ఉండే స్నేహం అడ్వాంటేజ్ ను వైసీపీ వాడుకుంటుంది కానీ..రాష్ట్రంలో ఆ పార్టీకి ఒక్క ఓటు ప్రయోజనం కలగదు. అంటే ఓ రకంగా అక్రమ సంబంధం అనుకోవాలి. గత ఎన్నికల్లో దీని వల్లనే వైసీపీ .. అనేక విధాలుగా లబ్ది పొందింది. కానీ టీడీపీతో మాత్రం డైరక్ట్ గా .. పొత్తులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు చాయిస్ బీజేపీ చేతిలో ఉంది. అయితే బీజేపీ అగ్రనాయకత్వం ఏం ఆలోచిస్తుందన్నది తేలాల్సి ఉంది. ముందు ముందు ఎన్నికల సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.