క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు దూకుడుకు క‌ళ్లెం వేయ‌గ‌ల‌రా?

నిర్మాత‌ల బంద్ వెనుక కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు మెల్లమెల్ల‌గా వెలుగులోకి వ‌స్తున్నాయి. హీరోలు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల పారితోషికాలు, వాళ్ల సిబ్బంది జీత భ‌త్యాలూ, ఎగ‌స్ట్రా ఖ‌ర్చులు ఇవ‌న్నీ భ‌రించ‌లేని నిర్మాత‌లు.. వాటిని ఎట్టిప‌రిస్థితుల్లోనూ అదుపులోకి తీసుకురావాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చారు. ముఖ్యంగా ఇద్ద‌రు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల‌పైనే నిర్మాత‌లు గురి పెట్టారు. ప్ర‌తీ మీటింగులోనూ ఆ రెండు పేర్లే నిర్మాత‌లు ఉచ్ఛ‌రిస్తున్న‌ట్టు ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. ఆ ఇద్ద‌రూ.. రావు ర‌మేష్‌, ముర‌ళీ శ‌ర్మ‌.

టాలీవుడ్ లో మాంఛి డిమాండ్ ఉన్న ఆర్టిస్టులు వీరిద్ద‌రూ. తండ్రి, బాబాయ్‌, మావ‌య్య‌, పాజిటీవ్‌, నెగిటీవ్ ఇలా ఏ పాత్ర‌లో అయినా ఇమిడిపోతారు. అందుకే ద‌ర్శ‌క నిర్మాత‌లు వీళ్ల‌పై మొగ్గు చూపిస్తుంటారు. దాన్ని ఆస‌రా చేసుకుని వీరిద్ద‌రూ గొంతెమ్మ కోరిక‌లు కోరుతున్నార‌న్నది నిర్మాత‌ల గోల‌. రావు ర‌మేష్ పారితోషికం రోజుకి రూ.5 ల‌క్ష‌లు. అక్క‌డితో ఆగ‌దు. క్యార్ వేర్ సెప‌రేట్ గా కావాలి. ఇద్ద‌రు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల‌కు ఓ కార్ వాన్ ఇస్తుంటారు. కానీ రావు ర‌మేష్‌కి అది న‌చ్చ‌ద‌ట‌. త‌న‌కు సెప‌రేట్ గా ఒక కార్ వాన్ కావాల‌ని డిమాండ్ చేస్తాడ‌ట‌. అంతే కాదు.. త‌న‌కు ముగ్గురు అసిస్టెంట్లు. వాళ్ల జీత భ‌త్యాలూ నిర్మాత‌లే భ‌రించాలి. ముర‌ళీ శ‌ర్మ‌దీ అదే తంతు. వీరిద్ద‌రి డిమాండ్లు నిర్మాత‌లు త‌ట్టుకోలేక‌పోతున్నార‌ని టాక్‌. నిన్న ప్రొడ్యూస‌ర్ గిల్డ్ తో `మా` మీటింగ్ జ‌రిగింది. ఈ మీటింగ్ లో వీరిద్ద‌రి పేర్లే గ‌ట్టిగా వినిపించాయ‌ని టాక్‌.

మ‌రో వైపు ఇద్ద‌రు హీరోల‌పై కూడా నిర్మాత‌లు దృష్టి పెట్టారు. ఆ ఇద్ద‌రికీ పారితోషికమే ప‌ర‌మావ‌ధి. సినిమా హిట్టు, ఫ్లాపుతో సంబంధం లేదు. సినిమా సినిమాకీ పారితోషికం పెంచుకుంటూ వెళ్తుంటారు. త‌మ సినిమా ఫ్లాప్ అయినా నిర్మాత‌ల‌కు పారితోషికాల్లో రిబేటు ఇవ్వ‌రు. అలాంట‌ప్పుడు ఆ హీరోల చుట్టూ ఎందుకు తిర‌గాలి? ఆ హీరోల‌తో సినిమాలు ఎందుకు చేయాలి? అని కొంత‌మంది నిర్మాత‌లు `మా` మీటింగ్ లో గ‌ట్టిగా వాదించిన‌ట్టు స‌మాచారం. ఆ ఇద్ద‌రు హీరోల్ని నిర్మాత‌లంతా ప‌క్క‌న పెట్టాల‌ని, అప్పుడు గానీ దారిలోకి రార‌ని కొంత‌మంది నిర్మాత‌లు అంటున్నారు. ఆ ఇద్ద‌రు హీరోలెవ‌ర‌న్న‌ది ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తావిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కులాల లెక్కలేసుకుంటే జనసేనకు 40 సీట్లొచ్చేవి : పవన్

కుల , మతాలు లేని రాజకీయం రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. మంగళగిరిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జెండా ఆవిష్కరించిన తర్వాత మాట్లాడారు. ఈ సందర్భంగా కుల, మతాల...

‘స‌లార్’ అప్‌డేట్‌: రిలీజ్ డేట్ ఫిక్స్‌

ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎప్ప‌టి నుంచో.. ఎదురుచూస్తున్న అప్ డేట్ వ‌చ్చేసింది. 'స‌లార్‌' రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. 2023 సెప్టెంబ‌రు 28న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ...

బింబిసార విజయ రహస్యం ఇదేనా?

కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్ కి రావడం తగ్గిపోయిందనే మాట సర్వాత్ర వినిపిస్తోంది. దీనికి కారణం ఓటీటీ ప్రభావమని కొందరంటే.. సినిమా టికెట్ రేట్లు ఇష్టం వచ్చినట్లు పెంచి మళ్ళీ తగ్గించి ప్రేక్షకుడికి...

‘బింబిసార‌’… సీక్వెల్ కాదు ప్రీక్వెల్‌

బింబిసార ఫ‌లితంతో సంబంధం లేకుండా బింబిసార 2 తీస్తామ‌ని చిత్ర‌బృందం ముందే ప్ర‌క‌టించింది. ఇప్పుడు బింబిసార అనూహ్య‌మైన విజ‌యాన్ని అందుకొంది. క‌ల్యాణ్ రామ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు. అందుకే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close