యూనిక్ కాన్సెప్ట్‌లు చేస్తాడని విష్ణు విశాల్‌కి పేరుంది. రాక్షసన్, ఎఫ్.ఐ.ఆర్., మట్టికుస్తీ సినిమాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. తన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు కూడా చేరవేయడానికి ఎప్పుడూ చొరవ చూపిస్తుంటారు. ఇప్పుడు ఆయన నుంచి ఆర్యన్ సినిమా రాబోతోంది. ఇది ఒక థ్రిల్లర్. సెల్వ రాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి వంటి స్టార్ కాస్ట్ ఇందులో ఉన్నారు.
గత వారం ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. అయితే మాస్ జాతర, బాహుబలి ఎపిక్ రావడంతో వాయిదా వేశారు. కానీ ఈ సినిమా తమిళంలో ఇప్పటికే విడుదలైంది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో తమిళ ప్రేక్షకులు పెదవి విరిచారు.
ఈ సినిమాకి రెండు క్లైమాక్స్‌లు షూట్ చేశారట. పబ్లిక్ టాక్‌ను బట్టి ఇప్పుడు మార్పులు చేశారు. తెలుగు వెర్షన్లో క్లైమాక్స్‌ని మార్చేశారు. కొత్త క్లైమాక్స్‌తో సినిమా విడుదల కానుంది. అలాగే తమిళ క్రిటిక్స్ చెప్పిన కొన్ని సూచనలను పాటిస్తూ ఎడిటింగ్‌లో కూడా మార్పులు చేశారు.
క్లైమాక్స్ సినిమాకి గుండెకాయ. సినిమా ఎలా ఉన్నా, క్లైమాక్స్ బావుంటే ఆడియన్స్ పాజిటివ్ ఫీలింగ్‌తో బయటకు వస్తారు. మరి ఈ క్లైమాక్స్ మార్పు తెలుగు వెర్షన్‌కి ఎంత మేలు చేస్తుందో చూడాలి.
