క్రికెట్ లో ధనాధన్ షాట్లతో అలరించే ఎంఎస్ ధోని ఆపరేషన్ సింధూర్ 2.0లో పాల్గొంటే ఎలా ఉంటుంది? క్లాసికల్ షాట్లతో అసలైన క్రికెట్ మజా అందించే సచిన్ టెండూల్కర్ వార్ జోన్ లో అడుగు పెడితే ఎలా ఉంటుంది? ఇది సినిమాలో తప్ప నిజ జీవితంలో ఎలా సాధ్యం అని ప్రశ్నించే వారు లేకపోలేదు. అయితే భారత్ – పాక్ ల మధ్య మరిన్ని ఉద్రిక్తత పరిస్థితులు నెలకుంటే ఎంఎస్. ధోనీతోపాటు సచిన్ టెండూల్కర్ వార్ జోన్ లోకి వెళ్లడం తథ్యం..క్రికెట్ లో ఎలాగైతే సిక్స్ లు బాదారో..బార్డర్ లో బుల్లెట్లు పేల్చడం ఖాయం.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. భారత్ ఆపరేషన్ సింధూర్ తో పాక్ కు గట్టి సమాధానమే చెప్పింది. తమతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో భారత్ సైన్యం చూపించింది. అయినా మారకుండా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఎలాగైనా భారత్ ఆత్మ స్థైర్యం దెబ్బతీయాలని పనిగా పెట్టుకుంది. డ్రోన్లు , మిస్సైళ్ళతో దాడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. కానీ భారత్ సైన్యం వాటిని దీటుగా తిప్పికొడుతోంది. పరిస్థితులు చూస్తుంటే భారత్ ను ఏదోఒక విధంగా దెబ్బతీయాలని చూస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆర్మీకి వెన్నుదన్నుగా ఉండేలా టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దింపాలని , ఈమేరకు ఆర్మీ చీఫ్ కు ప్రత్యేక అధికారులను ఇచ్చింది. టెరిటోరియల్ ఆర్మీ అంటే..భారత సైన్యానికి పార్ట్ టైం వాలంటీర్లుగా పని చేస్తారు. ఇందులోని సిబ్బందికి రెగ్యులర్ ఆర్మీకి ఇచ్చినట్లుగానే ట్రైనింగ్ ఇస్తారు. వీరంతా బయట ఉద్యోగాలు, చేసుకుంటూ అవసరమైన సమయంలో ఆర్మీతో జతకూడుతారు. ఈ టెరిటోరియల్ ఆర్మీలో టీమిండియా మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ , కపిల్ దేవ్ , ధోనిలు ఉన్నారు.
భారత్ – పాక్ మధ్య యుద్దమేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో ఈ టెరిటోరియల్ ఆర్మీ సేవలను వాడుకోవాలని సైన్యం భావిస్తే ధోని, సచిన్ వార్ జోన్ లోకి వెళ్లే అవకాశం ఉంది. గతంలో 1962లో చైనాతో యుద్ధం సమయంలో, 1999కార్గిల్ యుద్ధంలో ఈ టెరిటోరియల్ ఆర్మీ పాల్గొంది. మరోసారి భారత్ – పాక్ మధ్య యుద్ధం తలెత్తితే వీరు యుద్ధంలో పాల్గొనే అవకాశం ఉంది.