ఈనెల 24న ‘హరి హర వీరమల్లు’ విడుదల కాబోతోంది. రిలీజ్‌కు ముందు ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకోవడం చిన్నా, పెద్దా సినిమాలకు చాలా కీలకంగా మారింది. ‘వీరమల్లు’ ఓటీటీ ఎప్పుడో క్లోజ్ అయ్యింది. అమేజాన్ సంస్థ ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకొంది. ఈ సినిమాకు ఓటీటీ ద్వారా దాదాపు రూ.80 కోట్లు వచ్చినట్టు టాక్. వాస్తవానికి ఇది చాలా మంచి డీల్ అనే చెప్పాలి. హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా అమ్ముడుపోయినట్టే. ఈ రెండింటి ద్వారా అటూ ఇటుగా రూ.110 కోట్ల రాబట్టింది. కాకపోతే.. నిర్మాత ఎ.ఎం.రత్నం చాలా చోట్ల నుంచి ఫైనాన్స్ తెచ్చి ఈ సినిమాని పూర్తి చేశారు. నాన్ థియేట్రికల్ రూపంలో వచ్చిన ఆదాయం ఫైనాన్షియర్లకు పంచడానికే సరిపోయింది. కాబట్టి ఆయనకు ఇంకా రిలీఫ్ దొరకలేదనే చెప్పాలి.
మరోవైపు రెండు రోజుల్లో ట్రైలర్ రాబోతోంది. ఈ ట్రైలర్ తో ఫ్యాన్స్ కే కాదు, బిజినెస్ వర్గాల్లోనూ ఊపు వస్తుందని ఇన్ సైడ్ వర్గాలు భావిస్తున్నాయి. ట్రైలర్ చూసిన కొంతమంది ‘పవన్ ఫ్యాన్స్ కు ఫీస్ట్’ అనే కాంప్లిమెంట్లు ఇస్తున్నారు. పవన్ నోటి నుంచి వచ్చిన కొన్ని డైలాగులు జనాల్ని థియేటర్లకు రప్పించేలా ఉన్నాయని తెలుస్తోంది. మేకింగ్ పరంగానూ క్వాలిటీ కనిపించబోతోందని సమాచారం. నిర్మాత నాగవంశీ కూడా ఈ ట్రైలర్ పై ట్వీట్ చేసి అభిమానుల అంచనాలు పెంచేశారు. విడుదలకు మరో 20 రోజుల ముందుగానే ట్రైలర్ చూపిస్తున్నారంటే ఈ ట్రైలర్ సినిమా బిజినెస్ కి ఎంత ముఖ్యమో అర్థం అవుతోంది. వీరమల్లు నుంచి రావాల్సిన పాటలు ఇంకా ఉన్నాయి. ప్రమోషన్స్ ప్రక్రియ కూడా మొదలెట్టాల్సిన అవసరం వుంది. రిలీజ్‌కి ముందు మరో సర్ప్రైజింగ్ ట్రైలర్ కూడా వస్తుందని సమాచారం అందుతోంది. పవన్ ఇప్పుడు ‘ఉస్తాద్’ షూటింగ్ కి సమయం కేటాయించారు. ‘వీరమల్లు’ ప్రమోషన్లలోనూ ఆయన పాల్గొనే అవకాశం ఉంది.