“నీట్‌”పై స్టాలిన్‌కు “మిత్రులు” కూడా సహకరించరా ?

మెడికల్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నీట్‌పై దక్షిణాదిలో అసంతృప్తి ఉంది. అయితే తమిళనాడులోనే ఈ సమస్యను ప్రజలు ఎక్కువగా తీసుకున్నారు.  తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పట్టించుకోవడం లేదు. మెడికల్ ఎగ్జామ్ కోసం పోటీ పడేవాళ్లు తక్కువగా ఉండటమే దీనికి కారణం. కానీ తమిళనాడులో పరిస్థితి అలా లేదు.  అది రాజకీయ అంశమైపోయింది. దీంతో  నీట్‌ను రద్దు చేయాలని తమిళనాడు డిమాండ్ చేస్తోంది. పార్లమెంట్‌లో ఆందోళనలు చేస్తున్నారు. నీట్ రద్దు కోసం సమైక్యంగా పోరాడదామని స్టాలిన్ పలు మార్లు తన మిత్రులైన కేసీఆర్, జగన్‌లకు సందేశం పంపించారు.

కానీ వారు మాత్రం స్పందించడం లేదు. అయితే స్ఠాలిన్ మాత్రం తన పోరాటం ఆపడం లేదు. ఇటీవల ఏపీకి చెందిన ఓ విద్యార్థి ప్రత్యేకంగా స్టాలిన్‌కు నీట్ రద్దుపై చేసిన విజ్ఞప్తి హైలెట్ అయింది. తెలుగు రాష్ట్రాలు కలిసి వచ్చే పరిస్థితి లేకపోవడంతో తమ రాష్ట్ర విద్యార్థుల కోసం ఆయన ప్రత్యేక చట్టం తేవాలని ప్రయత్నిస్తోంది. తమిళనాడు విద్యార్థులను నీట్‌ నుంచి మినహాయించాలని కోరుతూ గతేడాది సెప్టెంబర్‌లో బిల్లును ఆమోదించారు. 12వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెడికల్‌ కోర్సుల్లో విద్యార్థులను చేర్చుకోవాలని తమిళనాడు సర్కారు ఆ బిల్లులో ప్రతిపాదించింది.

ఈ బిల్లు చాలా కాలం తన దగ్గరే పెట్టుకున్న గవర్నర్ చివరికి వెనక్కి పంపారు.  దీంతో మరోసారి నీట్‌ నుంచి విద్యార్థులను మినహాయించే బిల్లును ఆమోదించడం కోసం తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఎక్కువ రాష్ట్రాలు కలిస్తే దీనిపై బలంగా పోరాడటానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది ఒక్క తమిళనాడు సమస్యగానే మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close