ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలనాలు సృష్టించింది కాంతార. తక్కువ బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా కన్నడ బాక్సాఫీసు వద్ద సంచలనం రేపింది. తెలుగులో కూడా ఊహించని విజయం సాధించింది. అప్పటికి రిషబ్ శెట్టి అంటే ఎవరో, కాంతార నేపథ్యం ఏమిటో కూడా పెద్దగా పరిచయం లేదు. కానీ సినిమా మ్యాజిక్ చేసింది.
అయితే అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు చాలా మారిపోయాయి. కాంతార చాప్టర్ 1కి బడ్జెట్లు, అంచనాలు పెరిగిపోయాయి. వీటిని అందుకుంటుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. అప్పుడు అంచనాలు లేవు కాబట్టి ఒక్క క్లైమాక్స్ సీక్వెన్స్ సినిమాను నిలబెట్టింది. ఆడియన్స్ మెస్మరైజ్ అయ్యారు. మరి ఇప్పుడు అవుతారా? లేదా అనే డౌట్ ఉంది. ట్రైలర్ అయితే అంచనాలకు తగ్గట్టుగా లేదు. కానీ సినిమాలో ఏదో ఒక మ్యాజిక్ ఉందనే నమ్మకం మాత్రం ఉంది.
కాకపోతే టికెట్ రేట్లు పెంచడం ఒక నెగటివ్ పాయింట్‌గా అనిపిస్తోంది. ఒక డబ్బింగ్ సినిమాకి ఈ స్థాయిలో రేట్లు పెంచడం ఏమిటని కొందరు మాట్లాడుకుంటున్నారు. కొందరు బాయ్‌కాట్ కాంతార నినాదం కూడా అందుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.