“స్టాలిన్”ను ఇప్పుడైనా “మిత్రోం సీఎంలు” పట్టించుకుంటారా !?

తమిళనాడు సీఎం స్టాలిన్ అంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రత్యేక అభిమానం. పలు మార్లు మాటలతో ఈ అభిమానం వ్యక్తమయింది. స్టాలిన్‌కు కూడా అభిమానమే. ఆయన స్వయంగా జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి రావడమే దీనికి నిదర్శనం. అయితే స్టాలిన్‌ను మాత్రం ఈ మిత్రోం ముఖ్యమంత్రులు గౌరవిస్తున్నారో లేదో స్పష్టత లేదు. దక్షిణాది సమస్యలపై కేంద్రంపై పోరాడదామని గతంలో ఓ సారి లేఖ రాస్తే స్పందన లేదు. ఇప్పుడు మరోసారి స్టాలిన్ పోరాటానికి పిలుపునిచ్చారు. విద్యారంగంలో కేంద్రం పెత్తనాన్ని నిలదీద్దామని.. కలసి పోరాటం చేద్దాం రావాలని పిలుపునిచ్చారు.

స్టాలిన్ మొత్తం బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న పన్నెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ లేఖలు రాశారు. జాబితాలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ఇటీవలి కాలం రాష్ట్రాల హక్కులన్నింటినీ స్వాధీనం చేసుకుంటున్న కేంద్రం వైఖరి స్టాలిన్‌కు నచ్చడం లేదు. విద్యారంగంలో కేంద్రం పెత్తనాన్ని నిలదీద్దామని ఆయన ప్రయత్నిస్తున్నారు. కలసికట్టుగా పోరాడి కేంద్రంపై ఒత్తిడి పెంచుదామని ఆయన లేఖలో పిలుపునిచ్చారు. స్టాలిన్ ఇలా లేఖ రాయడానికి ప్రధానంగా నీట్‌ను కారణంగా చెప్పుకోవచ్చు.

మెడికల్ ఎంట్రన్స్ కోసం దేశవ్యాప్తంగా నీట్ ను ప్రవేశ పెట్టారు. ఈ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడులో చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విద్యార్థులపై నీట్ ప్రభావాన్ని ఎత్తిచూపారు. దీనిపై ఏకే రాజన్ కమిటీ నివేదిక కాపీని కూడా స్టాలిన్ 12 రాష్ట్రాల సీఎంలకు లేఖతో పాటు పంపారు. అంతేకాదు, ఏకే రాజన్ కమిటీ సిఫారసు చేసిన మేరకు తమిళనాడు అసెంబ్లీలో ఆమోదం పొందిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్ బిల్లు కాపీని కూడా తన లేఖకు జతచేశారు. మరి మిత్రుడు స్టాలిన్ పంపిన లేఖకు కనీసం ప్రత్యుత్తరం అయినా మిత్రులు ఇస్తారో లేదోచూడాలి. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ కేంద్రంపై పోరాడేందుకు ఇప్పటి వరకూ రెండు ప్రభుత్వాలూ ముందుకు రాలేదు మరి. !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close