రాజ్యసభలో ట్రిపుల్ తలాఖ్ టెస్ట్..! మోడీని రహస్య మిత్రులు గట్టెక్కిస్తారా..?

లోక్‌సభలో ఆమోదం పొందిన ట్రిపుల్ తలాఖ్ బిల్లును రాజ్యసభలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదింప చేసుకోవాలని… బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఎన్నికలకు ముందు తమకు ఇదో గొప్ప లిట్మస్ టెస్ట్‌గా… కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు.. పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకుంది. తమ ఎంపీలందరికీ.. విప్ జారీ చేసింది. ట్రిపుల్ తలాక్ బిల్లు గత గురువారంనాడు విపక్షాల వాకౌట్ మధ్య లోక్‌సభలో ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 245 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 11 ఓట్లు వచ్చాయి. అయితే.. ఇది ఎన్నికల స్టంట్‌గా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం.. ట్రిపుల్ తలాక్ బిల్లుపై అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అనేక సవరణలు సూచిస్తోంది. వాటిని చేస్తేనే మద్దతిస్తామని చెబుతోంది. కానీ బీజేపీ మాత్రం కాంగ్రెస్ అభ్యంతరాలను ఏ మాత్రం పట్టించుకునే మూడ్‌లో లేదు.

రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందకుండా ఇతర పార్టీలతో కలిసి నిలువరించాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది. బిల్లులో ప్రధానగంగా.. ట్రిపుల్ తలాక్‌ను క్రిమినల్ చర్యగా పరిగణించడం సరికాదని, కాంగ్రెస్ సహా విపక్షాలు వాదిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీది కూడా అదే వాదన. ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు మహిళా సాధికారతకకు ఏమాత్రం ఉపయోగపడదని..పైగా ముస్లిం యువకులను కేసుల్లో ఇరికించడానికి దుర్వినియోగం అవుతుందన్న ఆందోళన ఆయా పార్టీల్లో వ్యక్తమవుతోంది. బిల్లులోని కొన్ని ప్రొవిజన్లు రాజ్యాంగాన్ని, ముఖ్యంగా ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేవిగా ఉన్నాయని వ్యతిరికిస్తున్న పార్టీలు ఆరోపిస్తున్నాయి. తదుపరి పరిశీలన కోసం బిల్లును జాయింట్ సెలక్ట్ కమిటీకి పంపాలని కూడా ఆయా పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

కాంగ్రెస్ నుంచి గట్టి ప్రతిఘటనే ఎదురయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో ఎంపీల సంఖ్య 244. బిల్లు పాసవ్వాలంటే 123 మంది ఎంపీల మద్దతు అవసరం. ఎన్‌డీఏ సభ్యుల బలం 91గా ఉంది. వీరితో పాటు ముగ్గురు నామినేటెడ్‌ ఎంపీలు, ఎస్పీ ఎంపీ అమర్‌సింగ్‌ కూడా బిల్లుకు మద్దతిచ్చే అవకాశం ఉంది. అన్నాడీఎంకేకు చెందిన 13 మంది కూడా.. బిల్లుకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. బీజేపీతో విబేధాలున్నప్పటికీ.. ట్రిపుల‌్ తలాఖ్ బిల్లును సమర్థిస్తున్నందున శివసేన మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. బిల్లును వ్యతిరేకిస్తున్న పార్టీల్లో కాంగ్రెస్‌కు రాజ్యసభలో ప్రస్తుతం 61మంది ఎంపీలున్నారు. తృణముల్ కాంగ్రెస్‌కి 13, టీడీపీకి 6 , సీపీఎంకి ఐదుగురు, బీఎస్పీకి నలుగురు , డీఎంకేకి నలుగురు , ఇద్దరు సీపీఐ ఎంపీలు ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎపీలు కూడా బిల్లుకు వ్యతిరేకంగానే ఉన్నారు. అయితే టీఆర్‌ఎస్‌కు చెందిన ఆరుగురు, బీజేడీకి చెందిన 9 మంది ఎంపీల మద్దతు కీలకం కానుంది. వీరు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుంటే మాత్రం కేంద్రానికి ఇబ్బందికర పరిస్థితే. వాకౌట్ చేసినా… కేంద్రం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకునే అవకాశం ఉంది. వాస్తవానికి ఇది గత జనవరిలోనే ఆమోదం పొందాల్సి ఉంది. లోక్‌సభలో ఆమోదించిన తర్వాత రాజ్యసభకు వచ్చినప్పుడు టీడీపీ సహా కొన్ని మిత్రపక్షాలు హ్యాండిచ్చారు. అప్పట్లో.. బీజేపీకి రాజ్యసభలో ఇప్పుడున్నంత బలంలేదు. దాంతో కొన్ని కీలక సవరణలు చేసి మళ్లీ పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ బిల్లు రాజ్యసభ టెస్ట్‌కు వచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైకోర్టు తీర్పుకే వక్రభాష్యం..! ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందా..?

నిమ్మగడ్డ రమేష్‌కుమార్ విషయంలో ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందా.. అన్న అభిప్రాయం న్యాయనిపుణుల్లో వినిపిస్తోంది. ఇప్పటి వరకూ వివిధ కేసుల్లో హైకోర్టు తీర్పును అమలు చేయకుండా.. దొడ్డిదారి ప్రయత్నాలు చేశారు... కానీ...

ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే వరకూ రమేష్‌కుమార్ బాధ్యతలు తీసుకోకూడదట..!

స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ బాధ్యతలు తీసుకున్నట్లుగా ప్రకటించుకుని.. సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం చట్ట విరుద్ధమని తాజాగా ఏపీ ప్రభుత్వం వాదన వినిపించడం ప్రారంభించింది. సోమవారం.. ఎస్‌ఈసీగా రమేష్...

అన్‌లాక్ 1 : 8వ తేదీ నుంచి హోటళ్లు, ఆలయాలు ఓపెన్..!

దేశంలో లాక్‌డౌన్‌ను కంటెన్మెంట్‌జోన్లకే పరిమితం చేస్తూ... కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్‌ ముగింపు కోసం.. అన్‌లాక్ పాలసీని ప్రకటించింది. దీనిలో భాగంగా జూన్ ఎనిమిదో తేదీ నుంచి ఆలయాలు, హోటళ్లు,...

ఇన్ సైడ్ న్యూస్: సొంత పత్రిక , ఛానల్ ప్రారంభించడం కోసం జనసేన కసరత్తు

త్వరలోనే సొంత పత్రిక, టీవి ఛానల్ ప్రారంభించాలనే యోచన తో జనసేన పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు పార్టీలో క్యాడర్ నుంచే కాకుండా, పార్టీ ముఖ్య నేతల...

HOT NEWS

[X] Close
[X] Close