న‌రేష్ ‘తేనెతుట్టె’ని క‌దిపాడా?

మ‌ళ్లీ పెళ్లి.. ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేసింది. ఈ సినిమాలో ఏం ఉంటుంద‌న్న‌ది అంద‌రికీ మందే తెలుసు. ఇది న‌రేష్ – ప‌విత్రా లోకేష్ జీవితాల్లో జరిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల స‌మాహారం. టీజ‌ర్‌, ట్రైల‌ర్ చూసిన వాళ్ల‌కెవ‌రికైనా ఈ విష‌యం ఈజీగా అర్థం అవుతుంది. సినిమాల్లోనూ అదే ఉంది. అయితే.. స‌ర్ ప్రైజింగ్ విష‌యం ఏమిటంటే.. ఈ సినిమాలో సౌమ్య అనే పాత్ర‌ని చాలా క్రూరంగా చూపించారు. సౌమ్య అంటే.. న‌రేష్ మూడో భార్య ర‌మ్య అన్న‌మాట‌. త‌న‌ని ఓ సైకోగా చిత్రీక‌రించారు. డ‌బ్బు మ‌నిషిగా, భ‌ర్త ఆస్తిని దోచుకోవ‌డానికి కుట్ర ప‌న్నిన‌ట్టుగా చూపించారు. ఈ సినిమా చూశాక ర‌మ్య ఎలా స్పందిస్తున్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

నిజానికి న‌రేష్ – ర‌మ్య‌ల వివాదం క్ర‌మంగా తెర‌మ‌రుగు అవుతోంది. న‌రేష్ – ప‌విత్ర‌ల జంట‌… దాదాపుగా అఫీషియ‌ల్ అయిపోయింది. ర‌మ్య కూడా ఎలాంటి గొడ‌వ చేయ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో న‌రేష్ మ‌ళ్లీ అన‌వ‌స‌రంగా తేనె తుట్టెని క‌దిపిన‌ట్టైంది. ఈ సినిమాతో న‌రేష్ ఏం సాధించాడ‌న్న‌ది కూడా పెద్ద ప్ర‌శ్న‌. త‌న జీవితంలో ప‌విత్ర ఎందుకొచ్చింది, ఎలా వ‌చ్చింది? ర‌మ్య‌తో త‌న‌కున్న విబేధాలేంటి? అనే ప్ర‌శ్న‌ల‌కు త‌న కోణంలో స‌మాధానం చెప్పడానికి ఈ సినిమా ఉప‌యోగ‌ప‌డిందంతే. ప్ర‌తికూల అంశం ఏమిటంటే ఈ సినిమాతో రమ్య చేతికి ఓ అయుధం దొరికిన‌ట్టైంది. త‌న పాత్ర‌ని మ‌రీ బీ గ్రేడ్ చేసి చూపించార‌ని ర‌మ్య ఆరోపిస్తే.. అందులో త‌ప్పేం లేద‌నిపిస్తుంది. మ‌రి.. ర‌మ్య రియాక్ష‌న్ ఏమిటో? దాని ప‌రిణామాలేమిటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తలుపులు బద్దలు కొట్టి బండారుకు నోటీసులిచ్చిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు సినిమా స్టైల్ సీన్లు పండించడంలో రాటుదేలిపోతున్నరు. లోకేష్ కు వాట్సాప్ లో నోటీసులు పంపి ఢిల్లీలో షో చేశారు. కానీ నారాయణకు మాత్రం వాట్సాప్‌లో పంపి చేతులు...

ఎవరీ జితేందర్‌ రెడ్డి ?!

ప్రీలుక్ టీజర్ తో క్యురియాసిటీని పెంచింది జితేందర్‌ రెడ్డి. ఉయ్యాలా జంపాలా, మజ్ను సినిమాలతో డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో వస్తున్న చిత్రమిది. ఇటీవలే టైటిల్‌ రోల్‌లో...

రాజధాని రైతుల కౌలూ నిలిపివేత – ఉసురు తగలదా !?

రాజధాని నిర్మాణం కోసం తొమ్మిదేళ్ల క్రితం భూములు ఇచ్చిన రైతులకు ప్రతి ఏటా ఇచ్చే వార్షిక కౌలు కూడా జగన్ రెడ్డి సర్కార్ ఇవ్వడం లేదు. అన్ని ఒప్పందాలను ఉల్లంఘించారు. చివరికి కౌలు...

చంద్రబాబుకు గాంధీ మార్గంలో ప్రజల బాసట !

లేని స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి కనీస ఆధారం లేకపోయినా పాతిక రోజులుగా జైల్లో ఉన్న టీడీపీ అధినేత , ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు మద్దతుగా ప్రజలు గాంధీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close