ప్రభాస్ ఇప్పటికైనా మారతాడా ?

గత ఆరేళ్లలో ప్రభాస్ నుండి వచ్చిన సినిమా ఒక్కటంటే ఒక్కటే. బాహుబలి. మిర్చి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన ఏకైక సినిమా ఇది. దీనికి కారణం బాహుబలి కోసం దాదాపు నాలుగేళ్ళు లాక్ అయిపోవడం . 2013లో మిర్చి వచ్చింది తరువాత బాహుబలి తో బిజీ అయిపోయాడు ప్రభాస్. ఈ సినిమాని రెండు పార్టులుగా విడుదల చేశారు. గొప్ప విజయాన్ని అందుకున్నారు. తెలుగు సినిమా గర్వించదగ్గ విజయం ఇది. ఈ విషయంలో ప్రభాస్ అభిమానులు ఫుల్ హ్యాపీ.

కానీ ప్రభాస్ అభిమానులు ఒక చిన్న నిరుత్సాహం ఉంది. అదే డార్లింగ్ సినిమాలు చేయడంలో స్పీడు తగ్గించడం. బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి కనీసం ఏడాదికి ఓ సినిమా వస్తుందని ఆశ పెట్టుకున్నారా అభిమానులు. కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఆయన పై అంచనాలు పెరిగిపోయాయి. దీంతో ప్రభాస్ మనసు మారిపోయింది. ఆలస్యం అయినా పర్వాలేదు.. ప్యాన్ ఇండియా ఆడే సినిమాలు చేయాలని ఆడాలనే సినిమాలే చేయాలనుకున్నాడు ప్రభాస్. సాహో ని తెరపైకి తెచ్చాడు. దీని కోసం మళ్లీ రెండేళ్లపాటు లాక్ అయిపోయాడు.

దీంతో మరో బాహుబలి లాంటి సినిమా అవుతుందనే ఆశ ప్రభాస్ అభిమానులు ఉన్నప్పటికీ సినిమాలు తొందరగా చేయడం లేదనే కంప్లైంట్ అయితే అభిమానుల్లో ఉంది. అయితే సాహో తర్వాత డార్లింగ్ స్పీడ్ పెంచతాడనే నమ్మకం అభిమానుల్లో వుంది. అయితే దానికి సంబంధించి ఇప్పటివరకైతే ప్రభాస్ దగ్గర ప్లానింగ్ లేదనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘జాను’ అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇది కూడా పెద్ద సినిమానే కానీ దీనికి సంబంధించిన అప్డేట్స్ లేవు. ఇప్పటివరకు రిలీజింగ్ డేట్ ని లాక్ చేయలేదు. షూటింగ్ ఎంతవరకు వచ్చిందనే విషయం మీద కూడా క్లారిటీ లేదు. అలాగే ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్టు ప్రభాస్ ఒప్పుకోలేదు.
ఇప్పుడు ప్రభాస్ దృష్టి సాహో పైనే ఉంది. సాహో గనుక బాహుబలి రేంజ్ విజయం సాధిస్తే ప్రభాస్ ఆలోచనలు మారిపోవచ్చు. ఏడాదికో సినిమా అనే లెక్కలు వేసుకోకుండా భారీ సినిమాలకే మొగ్గు చూపించవచ్చు. ఒకవేళ ఇదే జరిగితే ప్రభాస్ అభిమానులు ఆశిస్తున్నట్లుగా ఏడాదికో సినిమా సాధ్యం కాకపోవచ్చు. ఏదేమైనా సాహోకి వచ్చే రిజల్ట్ బట్టి ప్రభాస్ నెక్స్ట్ ప్లానింగ్ ఉంటుందని చెప్పుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close