ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడా?

లేడీ యాంక‌ర్ల‌లో సుమ‌…ఓ సూప‌ర్ స్టార్ అయితే, మ‌గ యాంక‌ర్ల‌లో ప్ర‌దీప్ మాచిరాజు అంత‌టి పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ లో అత్యంత బిజియెస్ట్ యాంక‌ర్ త‌నే. ఇప్పుడు హీరోగానూ మారాడు. `30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా` సినిమాతో. మున్నా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో అమృత అయ్య‌ర్ హీరోయిన్‌. ఈనెల 29న విడుద‌ల అవుతోంది.

నిజానికి లాక్ డౌన్ కంటే ముందు రావాల్సిన సినిమా ఇది. థియేట‌ర్ల మూత వ‌ల్ల కుద‌ర్లేదు. ఈలోగా.. ఈ సినిమాకి చాలా ఓటీటీ ఆఫ‌ర్లు వ‌చ్చాయి. ఫ్యాన్సీ రేట్ల‌కు కొన‌డానికి ఆహా, జీ5 లాంటి సంస్థ‌లు ఉత్సాహం చూపించాయి. అయితే నిర్మాత‌లు మాత్రం ఈ సినిమాపై భ‌రోసా ఉంచి, థియేట‌ర్ రిలీజ్ కోసం ఎదురు చూశారు. ఎట్ట‌కేల‌కు ఈ సినిమా విడుద అవుతోంది. ఆడియో ప‌రంగా `నీలి నీలి ఆకాశం.. ఇద్దామ‌నుకున్నా` పాట సూప‌ర్‌డూప‌ర్ హిట్ట‌యిపోయింది. ఈ సినిమాపై జ‌నాల ఫోక‌స్ పెర‌గ‌డానికి ఆ పాటే కార‌ణం. పైగా ప్ర‌దీప్ హీరోగా ఏం చేస్తాడో, చూడాల‌నుకుంటోంది చిత్ర‌సీమ‌. ఈ సినిమా హిట్ట‌యితే.. ప్ర‌దీప్ తో సినిమాలు చేయ‌డానికి ఇద్ద‌రు ముగ్గురు నిర్మాత‌లు రెడీగా ఉన్నారు. ఏమాత్రం పాజిటీవ్ టాక్ వ‌చ్చినా, మ‌రో రెండు సినిమాల్లో ప్ర‌దీప్ హీరోగా బుక్క‌యిపోవ‌డం ఖాయం. ఫిమేల్ యాంక‌ర్ల‌లో.. ఎంత‌మంది ఉన్నా.. అన‌సూయ మాత్ర‌మే సినిమాల్లో రాణిస్తోంది. మెయిల్ యాంక‌ర్ల‌కు ఆ అవ‌కాశ‌మే లేదు. ఇదివ‌ర‌కు కొంత‌మంది యాంక‌ర్లు హీరోలుగా అవ‌తారం ఎత్తారు. వాళ్లంద‌రికీ నెగిటీవ్ రిజ‌ల్టే వ‌చ్చింది. ప్ర‌దీప్‌.. ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడేమో చూడాలి. ఈ సినిమా గ‌నుక హిట్ట‌యితే.. ప్ర‌దీప్ జాత‌క‌మే పూర్తిగా మార‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తరహాలో పథకాల అమలుకు కేసీఆర్ కసరత్తు..!

తెలంగాణ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసి.. ప్రజల్లో మళ్లీ నాటి విశ్వాసాన్ని పొందాలని అనుకుంటున్నారు. ఈ ఏడాది పూర్తి స్థాయిలో సంక్షేమ బడ్జెట్ ప్రవేశ పెట్టి.,. ఓ క్యాలెండర్...

ఆర్కే పలుకు : విశాఖలో వైసీపీ ఓడితే ఏపీ అసెంబ్లీ రద్దు..!

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిన విశాఖలో గెలవకపోతే సీఎం జగన్ అసెంబ్లీని రద్దు చేయాలనే ఆలోచనలో ఉన్నారా...?. అవుననే అంటున్నారు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ. వైసీపీ క్యాంప్‌లో ఆయనకు అత్యంత...

లార్డ్స్‌లో భారత్ కోసం ఎదురు చూస్తున్న టెస్ట్ వరల్డ్ కప్..!

ప్రపంచ టెస్ట్ చాంపియన్లుగా అవతరించడానికి భారత్‌కు గోల్డెన్ చాన్స్ వచ్చింది. లార్డ్స్ వేదికగా జూన్ 18 నుంచి ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్‌లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడనుంది. అహ్మదాబాద్ లో జరిగిన నాలుగో...

బెజవాడలో టీడీపీ వర్సెస్ టీడీపీ గ్రూప్ తగాదాలు

విజయవాడలో టీడీపీ నాయకులు .. ఎన్నికలకు ముందే ఆ పార్టీని ఓడగొడుతున్నారు. అధికార పార్టీ దూకుడుని తట్టుకుని ఎంతో కొంత గెలుపు చాన్స్ ఉందని అనుకుంటున్న బెజవాడ నేతలు.. పోలింగ్...

HOT NEWS

[X] Close
[X] Close