ఆ సీటు వైపే రాహుల్ మొగ్గు… ప్రియాంక‌కు ఛాన్స్ ఇస్తారా?

కాంగ్రెస్ కీల‌క నేత రాహుల్ గాంధీ ఈ ఎన్నిక‌ల్లో రెండు చోట్ల విజ‌యం సాధించారు. క‌ష్ట‌కాలంలో గెలిపించిన వ‌యనాడ్ నుండి మ‌రోసారి గెల‌వ‌గా, సోనియాగాంధీ సిట్టింగ్ స్థానం రాయ‌బరేలీ నుండి పోటీ చేసి గెలుపొందారు.

ఈనెల 24 నుండి పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఎంపీల ప్ర‌మాణ‌స్వీకారం ఉంటుంది. ఈలోపే రాహుల్ ఏదో ఒక స్థానానికి రిజైన్ చేయాల్సి ఉంది. దీంతో రాహుల్ ఆప‌ద‌లో ఆదుకున్న వ‌య‌నాడ్ వైపు ఉంటారా… వార‌స‌త్వంగా వ‌స్తున్న రాయ‌బరేలీ నుండి కొన‌సాగుతారా అన్న చ‌ర్చ జోరుగా సాగుతుంది.

అయితే, వ‌యనాడ్ నే వ‌దులుకునేందుకు రాహుల్ సిద్ధం అయ్యార‌ని.. కానీ వెరొక‌రికి ఛాన్స్ ఇవ్వ‌కుండా త‌న సోద‌రి ప్రియాంక‌ను అక్క‌డి నుండి ఉప ఎన్నిక‌లో నిల‌బెట్టే అవ‌కాశం ఉంద‌ని ఏఐసీసీ వ‌ర్గాలంటున్నాయి. రాహుల్ వ‌య‌నాడ్ ను వ‌దులుకుంటార‌ని కేర‌ళ కాంగ్రెస్ ఎప్పుడో ఫిక్స్ అయ్యింది. కానీ ప్రియాంక గాంధీ పోటీ చేస్తార‌న్న స‌మాచారం వారికి లేదు. కానీ, ఆ సీటును వ‌దులుకోవ‌టం ఇష్టం లేని రాహుల్ గాంధీ… ప్రియాంక గాంధీని పోటీ చేయాల‌ని కోరుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది.

నిజానికి, మ‌రో రెండు సంవ‌త్స‌రాల్లో యూపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌రం ఉంటుంది. యూపీ ఎన్నిక‌ల‌పైనే ఫోక‌స్ గా ప్రియాంక గాంధీ గ‌త ఏడు సంవ‌త్స‌రాలుగా ప‌నిచేస్తుంది. ఈ ఎన్నిక‌ల్లో కొంత ఫ‌లితం కూడా క‌న‌ప‌డ‌టంతో ప్రియాంక గాంధీయే యూపీలో ఉంటార‌ని, ఎంతో ఆద‌రించిన సౌత్ ఇండియా నుండి రాహుల్ కంటిన్యూ అవుతార‌న్న ప్ర‌చారం ఉన్నా… చివ‌ర‌కు రాహుల్ అటు వైపే మొగ్గుచూపుతున్నార‌న్న ప్ర‌చారం మొద‌లైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ ఉద్యోగ సంఘం నేతలు ఎక్కడ ?

వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు వాయిస్ లేకుండా చేసింది. ఉద్యోగ సంఘం నేతల్ని ఉద్యోగుల వాయిస్ కాకుండా తమ వాయిస్ వినిపించేలా చేయడంతో ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వారికి నోరు పెగలడం...

తననూ లెక్కేసుకోవాలంటున్న రమణదీక్షితులు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి రమణదీక్షితులుఓ విన్నపం చేశారు. సోషల్ మీడియాలో ఈ విన్నపం చేసుకున్నారు. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నింటినీ లిస్టవుట్ చేసుకుని తీసేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి.. ఆ...

ఫ్లాష్ బ్యాక్‌: జ‌మున‌ని ఎందుకు బ్యాన్ చేశారు?

కొన్నేళ్ల క్రితం ప్ర‌కాష్‌రాజ్‌ని 'మా' అసోసియేష‌న్ బ్యాన్ చేసిన సంగ‌తి ఇప్ప‌టికీ ఏదో ఓ సంద‌ర్భంలో త‌ల‌చుకొంటుంటాం. ఆ త‌ర‌వాత ఏ న‌టుడ్నీ అలా బ్యాన్ చేయ‌లేదు. కానీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే......

టీడీపీ క్యాడర్‌పై కేసుల ఎత్తివేత !

జగన్ రెడ్డి జమానాలో ఎఫ్ఐఆర్‌ల విప్లవం నడిచింది. నిజమైన రౌడీలు, ఖునీకోరులు హాయిగా తిరుగుతూంటే... టీడీపీ కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాపోస్టులు పెట్టినా వేధింపులు ఎదుర్కొన్నారు. కేసుల పాలయ్యారు. టీడీపీ అధికారంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close