ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో ‘ఓజీ’ రూపొందిస్తున్నాడు సుజిత్. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆత్రుతగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం చివరి దశ షెడ్యూల్ శరవేగంగా సాగుతోంది. ఆ తరవాత నానితో ఓ ప్రాజెక్ట్ చేయాల్సివుంది. ఈలోగా రామ్ చరణ్ కోసం సుజిత్ ఓ కథ సిద్ధం చేస్తున్నాడని ఇన్ సైడ్ వర్గాల టాక్. వీరిద్దరి కలయికలో ఓ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు చర్చలు నడుస్తున్నాయి. ‘ఓజీ’ రూపొందిస్తున్న డి.వి.వి.దానయ్యనే ఈ చిత్రానికి నిర్మాతగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
కాకపోతే ఈలోగా కొన్ని ఈక్వేషన్స్ సెట్ అవ్వాలి. ‘ఓజీ’ పూర్తయిన తరవాత సుజిత్ మరో ప్రాజెక్ట్ చేస్తాడా? లేదంటే రామ్ చరణ్ కోసం ఎదురు చూస్తాడా? అనేది తేలాలి. చరణ్ అయితే ఫుల్ బిజీ. ప్రస్తుతం ‘పెద్ది’ చేస్తున్నాడు. ఆ తరవాత సుకుమార్ ప్రాజెక్ట్ వుంది. మధ్యలో త్రివిక్రమ్ – వెంకీ సినిమాలో కూడా నటించబోతున్నాడంటూ సంకేతాలు అందుతున్నాయి. సో.. చరణ్ ఫ్రీ అయ్యేసరికి చాలా టైమ్ పట్టేట్టు వుంది. ఈలోగా నానితో సినిమా చేద్దామంటే తాను కూడా బిజీ. ప్రస్తుతం ‘పారడైజ్’ చేస్తున్నాడు. అది 2026 మార్చి నాటికి పూర్తవుతుంది. నాని ఒప్పుకొన్న కమిట్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి. వీలైనంత వరకూ నాని ప్రాజెక్ట్ పూర్తి చేశాకే చరణ్ సినిమాపై సుజిత్ దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు సెట్ పైకి వెళ్లినా ఈ కలయిక మాత్రం క్రాక్ తెప్పించడం ఖాయం.