లోకేష్‌కు సాక్షి రూ. 75 కోట్లు కడుతుందా ? సారీ చెబుతుందా ?

చినబాబు చిరుతిండి పేరుతో లోకేష్‌పై పేపర్ ఉందని బురద చల్లేశారు కానీ.. అది ఇప్పుడు సాక్షి పైనే పడింది. విశాఖ కోర్టులో ఆయన రూ. 75 కోట్లకు వేసిన పరువు నష్టం కేసులో వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో విచారణ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆ పత్రిక కథనంలో ఒక్కటంటే ఒక్క నిజం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సాక్షి పత్రికలో రాసినట్లుగా ఖర్చులు చేసినప్పుడు తాను విశాఖలో కూడా లేనని ఆధారాలు సమర్పించారు.

నిజానికి గత వైసీపీ హయాంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు లెక్కలేనన్ని చేశారు. అవి జాతీయ మీడియాకు కూడా లీకులిచ్చారు. ఇలా చాలా పత్రికలు రాయడంతో.. అన్నింటికీ నారా లోకేష్ లీగల్ నోటీసులు పంపించారు. అన్ని పత్రికలు నారా లోకేష్‌కు క్షమాపణలు ప్రచురించాయి. వార్తలలో తప్పుడు సమాచారం ఇచ్చామని ఒప్పుకున్నాయి. కానీ సాక్షికి మాత్రం ఈగో అడ్డం చ్చింది. స్వయంగా జగనే సాక్షిలో తప్పుడు వార్తలు రాస్తారని చెప్పుకున్నారు. అయినా .. లోకేష్ కు క్షమాపణలు ఏమిటని ఊరుకున్నారు.

లోకేష్ పట్టువదలకుండా .. కోర్టు వరకూ వెళ్లారు. ఇప్పుడు కాకపోతే.. మరోఆరు నెలల్లో అయినా కోర్టు.. లోకేష్ కు క్షమాపణలు చెప్పమనో.. పరిహారం చెల్లింమనో ఆధేశాలు ఇస్తుంది. ఎందుకంటే ఆ కథనాన్ని సమర్థించుకునేందుకు సాక్షి వద్ద ఆధారాలే లేవు. అప్పుడైనా క్షమాపణ చెప్పాలి లేదా పరిహారం కట్టాల్సిందే. సాక్షి ఏ మార్గం ఎంచుకుంటుందో మరి !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తిరుపతి లడ్డూ ఇష్యూ : అడ్డంగా దొరికినా అదే ఎదురుదాడి !

వైసీపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎదురుదాడి చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని.. పశువుల కొవ్వుతో కల్తీ...

తిరుప‌తి ల‌డ్డు చుట్టూ వివాదం… ఇంత‌కు ఈ ల‌డ్డూ ఎందుకింత స్పెష‌ల్?

తిరుప‌తి ల‌డ్డూ. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి వెంక‌న్న ద‌ర్శ‌నాన్ని ఎంత మ‌హాభాగ్యంగా భావిస్తారో... తిరుప‌తి ల‌డ్డూను అంతే మ‌హాభాగ్యంగా భావిస్తారు. ఉత్త‌రాది, ద‌క్షిణాది అన్న తేడా ఉండ‌దు... ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న...

అడియోస్ అమిగో రివ్యూ: అపరిచితుల జీవయాత్ర

సినిమా అనగానే ఇంట్రడక్షన్, పాటలు, ఫైట్లు, స్క్రీన్ ప్లే లో త్రీ యాక్ట్.. ఇలా కొన్ని లక్షణాలు ఫిక్స్ అయిపోతాయి. కానీ అప్పుడప్పుడు ఆ రూల్స్ ని పక్కన పెట్టి కొన్ని చిత్రాలు...

తిరుప‌తి ల‌డ్డూ నెయ్యి వివాదం- ఆధారాలు బ‌య‌ట‌పెట్టిన టీడీపీ

తిరుమ‌ల వెంక‌న్న ల‌డ్డూ ప్ర‌సాదం అంటే ఎంతో సెంటిమెంట్. క‌ళ్ల‌కు అద్దుకొని తీసుకుంటారు. వెంక‌న్న‌ను ద‌ర్శించుకున్నంతగా భావిస్తారు. కానీ ఆ ల‌డ్డూ త‌యారీలో వాడిన నెయ్యిని గొడ్డు మాసం కొవ్వుతో త‌యారు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close