సుప్రీంకోర్టుకు ఏమయింది..?

సుప్రీంకోర్టులో ఇద్దరు కొత్త న్యాయమూర్తులను నియమించారు. మామూలుగా అయితే ఇది సాధారణ ప్రక్రియే. కానీ క్రిస్మస్ ముందు జరిగిన సమావేశంలో.. సీనియార్టీని బట్టి… ఇద్దరు న్యాయమూర్తుల పేర్లను కొలిజియం రెడీ చేసింది. అయితే… క్రిస్మస్ అయిపోగానే.. కేంద్రానికి వెళ్లిన జాబితాలో ఆ రెండు పేర్లు లేవు. సీనియార్టీలో… 32 మందిని కాదని…. ఆ తర్వాత ఇద్దరు పేర్లతో కొలిజీయం సిఫార్సు చేస్తూ.. కేంద్రానికి పంపింది. కేంద్రం ఆ రెండు పేర్లనూ ఆమోదించింది. సీనియార్టీలో ఉన్న ఆ ఇద్దరి పేర్లను ఖరారు చేసి… మళ్లీ ఎందుకు తప్పించారు..? జూనియర్లుగా ఉన్న వారికి ఎందుకు అవకాశం కల్పించారు..? అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

క్రిస్మస్ కు ముందు.. కొలిజియం మీటింగ్‌లో … ఢిల్లీ, రాజస్థాన్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ రాజేంద్ర మీనన్, జస్టిస్ ప్రదీప్ నంద్రజోగ్ లకు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలిజీయం నిర్ణయించింది. అయితే ఆ తర్వాత కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దినేష్ మహేశ్వరి, ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా .. కొలిజియం పేరుతో చీఫ్ జస్టిస్ గొగోయ్ సిఫార్సు చేశారు. కేంద్రం కూడా ఆమోద ముద్ర వేసేసింది. దీనిపై న్యాయనిపుణుల్లో కలకలం ప్రారంభమయింది. గతంలో.. ఏ కారణంతో.. చరిత్రలో జరగని విధంగా.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రెస్ మీట్ పెట్టారో.. అవే ఘటనలు ఇప్పుడు జరుగుతున్నాయి. అసలు విశేషం.. ఏవి అయితే జరగుతున్నాయని.. ఆరోపిస్తూ ప్రెస్ మీట్ పెట్టిన రంజన్ గొగోయ్ ఇప్పుడు… సీజేగా ఉన్నారు. ఆయన నేతృత్వంలోని కొలిజియమే.. ఈ నిర్ణయాలు తీసుకుంటంది. అంటే.. తాము వ్యతిరేకించి.. ప్రెస్ మీట్ పెట్టి.. ఇప్పుడు అవే సీజే చేస్తున్నారు.

పలువురు న్యాయమూర్తులు… కొలిజియం నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నారు. చీఫ్ జస్టిస్ కు .. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజయ్ కౌల్ నేరుగా లేఖాస్త్రం సంధించారు. అదే సమయంలో బార్ కౌన్సిల్ కూడా… జూనియర్లను… సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మొత్తానికి సుప్రీంకోర్టుపై… వివాదాలు.. న్యాయవ్యవస్థను ఉంకూడదని పద్దతుల్లో వార్తల్లో ఉంచుతున్నాయి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close