ఇక ఏపీలో టీచర్ పోస్టుల భర్తీ లేనట్లే !

అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ అని సీఎం జగన్ అందర్నీ ఊరించారు. లక్షల మంది అభ్యర్థులు ఆశపడ్డారు. మూడేళ్లయిందది ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకపోగా.. రేషనలైజేషన్ పేరుతో పూర్తిగా స్కూళ్లను తగ్గించేస్తున్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలలను పెంచుతున్నారు. ఈ సంస్కరణల వల్ల ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేయకుండా వ్యూహం పన్నుతున్నారన్న అనుమానాలొస్తూంటే.. ఇప్పుడు బైజూస్‌తో ఒప్పందం చేసుకున్నారు . అంటే బైజూస్ ఆన్ లైన్ పాఠాలు వినిపిస్తున్నారు. మరి మన టీచర్లు ఏం చేస్తారు ?

బైజూస్ కొన్ని రికార్డెడ్ పాఠాలు వినిపిస్తుంది. మరికొన్ని క్లాసులు తీసుకుంటుంది. ఆ సంస్థ కూడా టీచర్లను రిక్రూట్ చేసుకుంటోంది. కానీ ఆ సంస్థ విధి విధానాలుతేడాగా ఉండటంతో చాలా మంది టీచర్లు మధ్యలోనే గుడ్ బై చెబుతున్నారు. అయితే చదువు చెప్పడమే కాబట్టి అర్హత లేని వారిని కూడా అవసరం కోసం నియమించుకుంటోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరు నియమించినా.. బైజూస్ విద్యార్థులకు ఆన్ లైన్‌లో వాళ్లే పాఠాలు చెబుతారు. గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకూ వారే చెబుతారు. క్లాసులో కోఆర్డినేట్ చేయడానికి ఓ టీచర్ ఉంటే సరిపోతుంది. అంటే క్లాస్ మొత్తానికి ఓ టీచర్‌తో సరి పెట్టవచ్చు.

ఇప్పుడు సబ్జెక్ట్ నిపుణులు కూడా అవసరం లేని పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం బైజూస్‌కు ఇంత బల్క్‌గా ఆర్డర్స్ ఇవ్వడం వల్ల ఆ సంస్థ మరింత బలోపేతం అవుతుంది కానీ.. ఏపీ విద్యావ్యవస్థ పరిస్థితి ఏమిటి? ఆ సంస్థ కు ఏటా ఐదారు వందల కోట్లు పెట్టే బదులు … టీచర్లను నియమించి.. మంచి చదువులు చెప్పే ప్రయత్నం ఎందుకు చేయరు. కారణం ఏదైనా ఇక ఏపీలో ఉపాధ్యాయులకు ప్రైవేటు ఉద్యోగాలే గతి. ఇంకా కావాలంటే బైజూస్‌లో చేరి.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠాలు చెప్పవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close