తెలంగాణలో కరోనా పరిస్థితుల్ని చక్క దిద్దడానికి .. గవర్నర్ తమిళసై రంగం సిద్ధం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. పరిస్థితులు బాగో లేవు.. మీరు జోక్యం చేసుకోవాలన్న విజ్ఞప్తి రాగానే ఒక్క సారిగా యాక్టివ్ అయ్యారు. ఈ సూచనలు చేసింది ఎవరో కాదు.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మధ్యాహ్నం సమయంలో.. గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ కు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రారు. రాష్ట్రంలో కరోనా తీవ్ర స్థాయిలో ఉంది. మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు తీవ్రంగా కరోనా బారిన పడతారని.. అందులో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్షంగా వ్యవహారిస్తోందని తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే.. ఇలాంటి లెటర్లు గతంలో ఉ్తతమ్ చాలా రాశారు. రిప్లయ్ రాలేదు. స్వయంగా వెళ్లి కలసి వచ్చారు.. కానీ ఎప్పుడూ అనుకున్న రియాక్షన్ రాలేదు.
ఇప్పుడు మాత్రం.. ఇలా లేఖ రాసిన అరగంటలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాజ్ భవన్ నుంచి ఫోన్ వచ్చింది. గవర్నర్ మాట్లాడారు. ఉత్తమ్ నుంచి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘంతో మాట్లాడుతానని గవర్నర్ ఉత్తమ్‌కు హామీ ఇచ్చారు. గవర్నర్ రియాక్షన్‌తో ఉత్తమ్ ఖుషీ అయ్యారు. అయితే.. గవర్నర్ ఇంత ఉత్సాహంగా స్పందించడం… తెలంగాణ రాజకీయవర్గాలను కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు… యాక్టింగ్ చీఫ్ మినిస్టర్ గా వ్యవహరించే.. కేటీఆర్‌కు కూడా కరోనా సోకింది. వారు ఇప్పుడు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.
ఈ సమయంలో కరోనా పరిస్థితులు.. ఎన్నికల విషయంలో స్పందించడం … యథాలాపంగా జరిగింది కాదని అంటున్నారు. కరోనా కట్టడి విషయంలో తెలంగాణ సర్కార్ తీరుపై.. మొదటి విడత కరోనా సమయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. సరైన చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పుడు.. సెకండ్ వేవ్ సమయంలో వెంటనే రంగంలోకి దిగినట్లయింది. ఈ దూకుడు కొనసాగిస్తారా.. లేక ఆపేస్తారా అన్నది ముందు ముందు చర్యలను బట్టి వెల్లడి కానుంది.