ఏపీలో ధియేటర్లు మూతబడతాయా !?

ఆన్‌లైన్ టిక్కెట్లు, సినిమాల కలెక్షన్లను గుప్పిట పెట్టుకోవాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వర్కవుట్ కావట్లేదు. తమ ఆదాయాన్నంతా ప్రభుత్వం చేతుల్లో పెట్టి.. ప్రభుత్వం ఇచ్చే దాని కోసం వెయిట్ చేయడం కన్నా అసలు ధియేటర్లు మూసుకోవడమే మంచిదన్న భావనలో ఉన్నారు. ప్రభుత్వం ఎన్ని రకాలుగా బెదిరింపులకు పాల్పడినా.. చివరికి యాప్ మాత్రమే కాదు బుక్ మై షో కూడా ఉంటుందని చెప్పినా.. ఒక్క రోజులోనే నగదు జమ చేస్తామని చెప్పినా ఎగ్జిబిటర్లు నమ్మడం లేదు.

అసలే ధియేటర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోతూండటం ప్రభుత్వం వివిధ రకాల పన్నుల పేరుతో బాదుడు చేపట్టడం.. చివరికి ఇష్టం లేని హీరోల సినిమాలు వస్తే కలెక్షన్లు తగ్గించడానికి సీజ్ కూడా చేస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వంతో పెట్టుకోవడం కన్నా.. సైలెంట్‌గా ఉండటం మంచిదన్న అభిప్రాయంలో ఉన్నారు. ఇప్పటికే ఫిల్మ్ చాంబర్ కూడా.. ఓ ప్రతిపాదన పెట్టింది. కానీ ప్రభుత్వం అంగీకరించలేదు. కానీ కోర్టు కేసులు ఇతర కారణాల వల్ల కొన్ని మినహాయింపులు ఇస్తూ.. తమ యాప్ లో గెట్ వే చార్జెస్ ఉండవని.. ఇతర ఒప్పందాలు కూడా ఉంటాయని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎగ్జిబిటర్లు నమ్మడం లేదు.

ఇప్పటికే ఈస్ట్ గోదావరిలో ధియేటర్లన్నీ మూసి వేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇతర జిల్లాల వాళ్లు కూడా అదే నిర్ణయం తీసుకోనున్నారని చెబుతున్నారు. జూలై ఒకటో తేదీ నుంచి ప్రతీ రోజు ఏపీలో సినిమా ధియేటర్లకు వచ్చే కలెక్షన్ ప్రభుత్వం ఖాతాలో పడనుంది. అక్కడ్నుంచి ఎవరివి వారికి తర్వాత రోజు ఇవ్వనున్నారు. అలా చెప్పారు కానీ ఇస్తారని ఎవరూ నమ్మడం లేదు. అందుకే ఎంవోయూకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఎంవోయూ చేసుకోకపోతే .. అనుమతులన్నీ రద్దు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. దాని కంటే ముందే తాము ధియేటర్ల మూసివేతకు నిర్ణయం తీసుకుంటున్నారు. హైకోర్టులోనూ ఈ అంశంపై విచారణ జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close