అమిత్ షాకు కాకపోయినా బీఎల్ సంతోష్‌కైనా నోటీసులివ్వగలరా !?

ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నం చేశారంటూ నమోదైన కేసులో తెలంగాణ సర్కార్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా పేరున్న సీవీ ఆనంద్ నేతృత్వంలో సిట్‌ను నియమించింది. సీనియర్ అధికారులు ఇందులో భాగంగా ఉన్నారు. నిందితుల్ని కోర్టు రెండు రోజుల కస్టడీకి ఇచ్చింది. వారిని ప్రశ్నించిన తర్వాత సిట్ ఎలాంటి అడుగులు వేస్తుందనేది కీలకంగా మారింది. ఫామ్ హౌస్ ఫైల్స్ పేరుతో ఈ డీల్స్‌కు సంబంధించిన ఆడియో వీడియోలన్నింటినీ కేసీఆర్ బహిరంగంగా విడుదల చేశారు.

అన్ని మీడియా సంస్థలతో పాటు న్యాయమూర్తులకూ పంపించారు. ఈ కేసును సాదాసీదాగా చూడవద్దని కోరారు. అదే సమయంలో తెలంగాణ పోలీసులే కేసు విచారణ జరుపుతూండటం.. పూర్తి స్థాయ ఆధారాలు ఉన్నాయని సీఎం ప్రకటించడంతో సిట్ ఎలాంటి ముందడుగు వేయబోతోందన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం మొత్తం 23 మందితో ముఠా ఉందని కేసీఆర్ ప్రకటించారు. ఈ ముఠా నాయకుడు ఎవరన్నది కూడా తేలాల్సి ఉందని కేసీఆర్ అన్నారు. ఈ కోణంలో సిట్ దర్యాప్తు చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు కీలకం.

ఈ కేసు విషయంలో ఉన్న ఆధారాలన్నీ మాటల ద్వారానే ఉన్నాయి. డాక్యుమెంట్ల రూపంలో లేవు. డబ్బులు ఎలా తరలించారు.. ఎంత తరలించారు.. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలకు ఎలా చెల్లింపులు చేశారన్నది కూడా సిట్ బృందం బయటకు లాగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. తెలంగాణ పోలీసులు ఈ కేసు విషయంలో అన్ని ఆధారాలు సేకరిస్తే.. సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా సంచలనం అయ్యే అవకాశాలున్నాయి. కానీ తెలంగాణ పోలీసులు .. టేపుల్లో ఉన్నట్లుగా కనీసం అమిత్ షాకు కాకపోయినా… కింగ్‌పిన్‌గా చెబుతున్న బీఎల్ సంతోష్‌కైనా నోటీసులు జారీ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close