పులివెందుల ఉపఎన్నికపై వైసీపీ చేతులెత్తేసే పరిస్థితి కనిపిస్తోంది. పోటీ చేయకుండా ఎలా తప్పించుకోవాలా అని తర్జన భర్జన పడి చివరికి దాడులు చేస్తున్నారని చెప్పి .. పోటీ నుంచి విరమించుకునేందుకు రెడీ అయింది. పులివెందుల మండలంలో నల్లగొండువారి పాలెం అనే గ్రామానికి వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వెళ్లారు. అక్కడ ఎవరు దాడి చేశారో కానీ.. పెద్ద దాడి జరిగిందని ఆయన కార్లపై రాళ్లు పడ్డాయని .. ఆస్పత్రికి వెళ్లారు. ఆయన ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు కానీ చికిత్స చేసినట్లుగా హడావుడి చేశారు.
ఆయన కారు అద్దాలు మా్తరం ధ్వంసమయ్యాయి. అలా దాడి జరగగానే .. అలా జరుగుతుందని తెలిసినట్లుగా విజయవాడలో ఎస్ఈవో కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. మరో వైపు మా పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని సతీష్ రెడ్డి అంటున్నారు. అసలు దాడి జరిగిందో లేదో కానీ.. మొత్తానికి వీరు చేస్తున్న హడావుడి మాత్రం ఓ రేంజ్ లో ఉంది.
ఏం జరిగిందో తెలుసుకోవడానికి డీఐజీ కోయ ప్రవీణ్ పులివెందులకు వెళ్లారు. టీడీపీలో చేరేందుకు పలువురు వైసీపీ నేతుల ప్రయత్నిస్తూండటంతో… వారిని ఆపేందుకు వైసీపీ నేతలు దాడుల డ్రామాలాడుతున్నారని అంటున్నారు. జగన్ రెడ్డికి కంచుకోట లాంటి పులివెందులలో వైసీపీ ఎమ్మెల్సీపై నిజంగా దాడి జరిగితే వారి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.