రాజీనామాలు చేసి వస్తే టీడీపీలో చేర్చేసుకుంటారా ?

వైసీపీలో రాజీనామాల విప్లవం ప్రారంభమయింది. ఆ పార్టీకి రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా ఎంపీ మోపిదేవి వెంకటరమణతో పాటు.. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. మోపిదేవి ఢిల్లీ వెళ్లి స్పీకర్ కు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా లేఖ ఇచ్చి ఆ తర్వాత వైసీపీకి రాజీనామా చేసినట్లుగా అధికారికంగా ప్రకటిస్తారు. ఆయన గత ఆదివారం మరో ఎంపీతో కలిసి వెళ్లి చంద్రబాబును కలిశారని చెబుతున్నారు.

ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా ఎమ్మెల్సీ పదవికి.. వైసీపీకి రాజీనామా చేశారు. ఏ పార్టీలో చేరుతారని చెప్పలేదు కానీ భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కేబినెట్ భేటీ తర్వాత మంత్రి వర్గ సహచరులతో పిచ్చాపాటిగా మాట్లాడినప్పుడు ఎవరు టీడీపీలోకి వచ్చినా రాజీనామాలు చేసి రావాల్సిందేనన్నారు. అంటే ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసిన వాళ్లంతా టీడీపీలోకి వస్తారా అన్న చర్చలు ప్రారంభమయ్యాయి.

పోతుల సునీత కుటుంబానికి చంద్రబాబు చేసిన సాయం గురించి టీడీపీలో అందిరకీ తెలుసు. అలాంటి మహిళా నేత.. టీడీపీ ఓడిపోయాక వైసీపీలో చేరి.. చంద్రబాబు కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేశారు. భువనేశ్వరి, బ్రాహ్మణిపై నోరు పారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై నారా లోకేష్ కోర్టులో కేసు కూడా ఫైల్ చేశారు. ఇప్పుడు ఆమె ఎమ్మెల్సీ పదవికి.. వైసీపీకి రాజీనామా చేయడంతో టీడీపీలోకి తీసుకుంటారా అన్న చర్చ ప్రారంభమయింది. కానీ ఆమెకు వ్యతిరేకంగా టీడీపీలో బలమైన వాయిస్ వినిపిస్తోంది. అలాంటి అవకాశ వాదుల్ని పార్టీలోకి తీసుకోవద్దని డిమాండ్లు గట్టిగానే వినిపిస్తోంది.

గత ఐదేళ్లుగా వైసీపీలో ఉండి.. చంద్రబాబు కుటుంబాన్ని… టీడీపీని నానా మాటలన్న వారు.. అనేక రకాల వేధింపులకు పాల్పడినన ఇప్పుడు టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తే తీసుకోకపోవడం మంచిదని.. అలా తీసుకుంటే.. కార్యకర్తల్లో అసహనం పెరుగుతుందని పార్టీ నేతలంటున్నారు. మరి పార్టీ హైకమాండ్ ఎంత మేల ఆలకిస్తుందో చూడాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌న‌సేన‌లోకా… కాంగ్రెస్ గూటికా… బాలినేని దారెటు?

అదిగో రాజీనామా... ఇదిగో రాజీనామా... వైసీపీకి బాలినేని గుడ్ బై చెప్పేస్తారు అంటూ కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. వైసీపీలో ఉన్న వైవీ సుబ్బారెడ్డితో విభేదాలు, జ‌గ‌న్ పై అసంతృప్తి అన్నీ క‌లిసి......

వైసీపీకి బిగ్ షాక్… బాలినేని రాజీనామా!

ఎన్నో రోజులుగా ఉన్న అసంతృప్తి... జ‌గ‌న్ ఎన్ని రాయ‌బారాలు పంపినా బాలినేని ఆగ‌లేదు. ముక్కుసూటిగా మాట్లాడుతార‌న్న పేరున్న మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎన్నిక‌లకు ముందు...

బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను కూల్చివేయండి… హైకోర్టు కీల‌క ఆదేశాలు

బీఆర్ఎస్ పార్టీ అనుమ‌తి లేకుండా పార్టీ ఆఫీసును నిర్మించింద‌ని దాఖ‌లైన పిటిష‌న్ పై హైకోర్టు సంచ‌ల‌న తీర్పునిచ్చింది. 15రోజుల్లో పార్టీ ఆఫీసును కూల్చివేయాల‌ని స్ప‌ష్టం చేసింది. న‌ల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ...

కొడాలి నాని.. వల్లభనేని వంశీ సైలెన్స్ వెనక కారణం ఇదేనా ?

కొడాలి నాని.. వల్లభనేని వంశీ...ఫైర్ బ్రాండ్ నేతలు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడూ ప్రత్యర్ధి పార్టీల నేతలపై చెలరేగిపోయిన వీరిద్దరూ .. కూటమి అధికారంలోకి వచ్చాక పూర్తిగా సైలెంట్ అయిపోయారు. కూటమి సర్కార్ అధికారంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close