జగన్ ఎవరితో విద్యుత్ ఒప్పందాలు చేసుకోవాలనుకుంటున్నారు?

విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో.. కేంద్రం మాటలను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లెక్క చేయని పరిస్థితులు కనిపిస్తున్నారు. పెట్టుబడిదారులను.. ఆందోళనకు గురి చేసే నిర్ణయాలు తీసుకోవద్దని.. రెండు సార్లు లేఖలు రాసినప్పటికీ.. పీపీఏల రద్దుకే జగన్ మెగ్గుచూపుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పీపీఏలపై సర్కార్ నియమించిన కమిటీ.. ప్రెస్‌మీట్ పెట్టి మరీ అవే అర్థంలో వ్యాఖ్యలు చేసింది. కేంద్రంతో సైతంతో ఘర్షణ పడేలా.. జగన్మోహన్ రెడ్డి.. ఇలాంటి వైఖరి తీసుకోవడం ఏమిటన్న చర్చ ఏపీలో ప్రారంభమయింది. జగన్ బినామీ పవర్ ప్రాజెక్టులతో ఒప్పందాల కోసం.. ఈ పని చేస్తున్నారా.. అన్న అనుమానాలు కూడా.. ప్రారంభమయ్యాయటే.. అది కచ్చితంగా పీపీఏల విషయంలో ఏపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరే కారణం.

పీపీఏలపై అవినీతి లేదంటున్నా జగన్‌కు అంత ఆరాటం ఎందుకు..?

ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రమాణస్వీకారం చేయక ముందు నుంచీ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి… చంద్రబాబు సర్కార్ చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల గురించే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా..సౌర, పవన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో అక్రమాలున్నాయని..వాటిలో అవినీతిని వెలికి తీసి రద్దు చేస్తామని.. పదే పదే ప్రకటిస్తూ వస్తున్నారు. మొదటగా కేంద్ర ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి.. పీపీఏల రద్దు వంటి చర్యల జోలికి వెళ్తే ఎటువంటి పరిణామాలు వస్తాయో.. వివరిస్తూ లేఖ పంపారు. ఆ లేఖ వచ్చిన తర్వాత కూడా.. జగన్మోహన్ రెడ్డి.. తొలి కేబినెట్ భేటీలోనే… పీపీఏలను సమీక్షించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ సారి కేంద్రమంత్రే లేఖ పంపారు. కారణాలు లేకుండా పీపీఏలు రద్దు చేస్తే చట్టపరమైన సమస్యలు వస్తాయన్నారు. కేంద్రం రెండు సార్లు చెప్పడంతో.. ఏపీ సర్కార్ వెనక్కి తగ్గుతుందనుకున్నారు. కానీ.. జగన్మోహన్ రెడ్డి మాత్రం..డోంట్ కేర్ అంటున్నారు.

కేంద్రంపైనే నిందలేయడానికి ఎందుకు వెనుకాడటం లేదు..!?

పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల విషయంలో.. కేంద్రానికి ఎదురెళ్లాలని ఏపీ సర్కార్ గట్టి పట్టుదలతో ఉన్నట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. కచ్చితంగా… పీపీఏలను రద్దు చేసే దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో… కేంద్ర ప్రభుత్వానికి తాము ప్రత్యుత్తరాలు రాయాలని నిర్ణయించుకున్నారు. కేంద్రానికి ఏమీ తెలియదన్నట్లుగా.. లేఖలను ఏపీ సర్కార్ తేలిగ్గా తీసుకుంది. అన్ని పీపీఏలను సమీక్షించి తీరుతామని ప్రకటించారు. ఆ తర్వాత రద్దుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పీపీఏల రద్దు వల్ల పెట్టుబడులు రాకుండా పోతాయని కేంద్రం దుష్ప్రచారం చేస్తోందని కూడా.. వైసీపీ ఆరోపిస్తోంది.

పీపీఏలు రద్దు చేసి జగన్ బినామీ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటారా..?

కేంద్రం రెండు సార్లు చెప్పినప్పటికీ.. ఏపీ సర్కార్.. పీపీఏల విషయంలో మొండి పట్టుదలకు పోతూండటం… ఆసక్తి రేపుతోంది. కేంద్రంతో ఏపీ సర్కార్ ఘర్షణ వైఖరికి వెళ్తోందా అన్న అభిప్రాయం ఏర్పడుతోంది. సాధారణం కేంద్రం నుంచి.. వచ్చే ఇలాంటి అధికారిక లేఖలకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. ఓ రకంగా అది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. అయినా వెనక్కి తగ్గడం లేదు. పీపీఏలను రద్దు చేసి కొత్త ఒప్పందాలు చేసుకోవాలనకుంటున్నారు. బడ్జెట్‌లో రూ. రెండు వేల కోట్లు కూడా కేటాయించారు. జగన్‌కు ఉత్తరాదిలో పెద్ద ఎత్తున బినామీలతో.. విద్యుత్ ప్రాజెక్టులున్నాయన్న ప్రచారం ఉంది. బహుశా.. వాటి నుంచి కరెంట్ కొనుగోలు కోసం.. ఈ ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఇంతటితో ఈ ఇష్యూ ఆగదన్న అభిప్రాయం మాత్రం ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ‘లేడీస్ స్పెష‌ల్’

ముందు నుంచీ... విభిన్న‌మైన దారినే వెళ్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌ను ఎంచుకొనే ప్ర‌తీ క‌థా... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓవ‌ కొత్త జోన‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. 'హ‌నుమాన్' తో పాన్ ఇండియా క్రేజ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close