రాజధాని దళిత రైతుల నుంచి స్థలాలు వెనక్కి..? నోటీసులు జారీ..!

అమరావతికి భూములిచ్చిన రాజధాని దళిత రైతులు అనుకున్నంత అవుతోంది. అసైన్డ్ భూముల పేరుతో వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే ఇళ్ల స్థలాల కోసం.. రాష్ట్ర వ్యాప్తంగా అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుని.. సెంట్ చొప్పున పంపిణీ చేసిన ప్రభుత్వం.. అమరావతిలో దళిత రైతుల వద్ద మాత్రం తీసుకోలేకపోయింది. దీనికి కారణం.. అసైన్డ్ భూములయినప్పటికీ.. ఇతర పట్టా భూముల్లాగే అన్ని హక్కులు దళిత రైతులకు కల్పిస్తూ.. అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే. కొంత కాలంగా దళితుల భూముల కేంద్రంగా వివాదం రేపుతున్న వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి… ఎవరూ ఫిర్యాదు చేయకుండానే… భూములు పరాధీనం అయ్యాయని ఫిర్యాదులు చేస్తున్నారు. సీఐడీ కేసులు కూడా నమోదు చేసింది.

అయితే రాజధాని దళిత రైతులు మాత్రం తమ భూమి తమ దగ్గరే ఉందని.. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన మేరకు.. ఇష్ట పూర్వకంగానే ఇతరులకు అమ్ముకున్నామని అయితే.. ప్రభుత్వం ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు కూడా తమ పేరుపైనే ఉన్నాయని చెబుతున్నారు. ఈ వివాదం ఇలా కొనసాగుతూండగానే.. అస్సైన్డ్‌ రైతులు కొందరికి అధికారులు నోటీసులు జారీ చేశారు. మీకు నివాస, వాణిజ్య ఫ్లాట్ల కేటాయింపును రద్దు చేసి, వాటిని ఎందుకు వెనక్కు తీసుకోకూడదో 15 రోజుల్లోగా చెప్పాలని, లేకపోతే తమ వద్ద అందుబాటులో ఉన్న ఆధారాల్ని బట్టి ఫ్లాట్ల కేటాయింపు రద్దు చేస్తామని నోటీసుల్లో తెలిపారు. అసైన్డ్ రైతుల్లో ఆరు కేటగిరీలు ఉన్నాయి. వీరిలో ఓ కేటగిరీ కింద ఉన్న రైతులకు ప్రస్తుతం నోటీసులు జారీ చేశారు.

ఒకరి తర్వాత ఒకరు.. మొత్తంగా దళిత రైతులందరికీ ఈ నోటీసులు జారీ చేస్తారని.. వారికి కేటాయించిన ప్లాట్లను రద్దు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ వైసీపీ నేతల వ్యూహం దీని కోసమే నడుస్తోందని.. ఫైనల్‌గా అమలు చేస్తున్నారని రాజధాని రైతులు అనుమానిస్తున్నారు. దళితుల భూములపై కన్నేసి.. వారి కోసం పోరాడుతున్నట్లుగా నటిస్తూ… మొత్తం అమరావతిపై కుట్ర చేశారని అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారం ముందు ముందు మరింత ముదిరే అవకాశం ఉంది. రాజకీయ రచ్చ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కత్తి మహేష్ టెంప్లేట్ వైకాపా వదలదా? కత్తి స్థానాన్ని పోసాని భర్తీ చేయగలరా ?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైఎస్ఆర్సిపి మంత్రులు వర్సెస్ పవన్ కళ్యాణ్ అంటూ చిన్న సైజు యుద్ధమే జరుగుతుంది. సినిమా టికెట్లను ప్రభుత్వ పోర్టల్ ద్వారా అమ్మాలి అన్న జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పవన్...

పోసాని మళ్లీ రచ్చ – దాడికి ప్రయత్నించిన పవన్ ఫ్యాన్స్ !

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరోసారి మీడియా ముందుకు వచ్చిన పోసాని కృష్ణమురళి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం పెట్టి "పవన్ నీకెంత...

ప్రజల వరద కష్టాల కన్నా మీడియాకు సినిమా గొడవలే మిన్న !

ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో తుపాన్ బీభత్సం సృష్టించింది. ఏపీలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పటికీ తేరుకోలేదు. కొన్ని వందల గ్రామాల్లో అంధకారం అలుముకుంది. ఇక నష్టపోయిన వారి గురించిచెప్పాల్సిన...

పంజాబ్ కాంగ్రెస్ చిందర వందర !

అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదో చేద్దామని ప్రయత్నించిన కాంగ్రెస్ హైకమాండ్... పంజాబ్ లో పార్టీని చిందర వందర చేసుకుంది. సిద్దూకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి అందర్నీ కూల్ చేయాలనుకుంటే చివరికి అదే...

HOT NEWS

[X] Close
[X] Close