“ నన్ను తిట్టారని నా అభిమానస్తులకు బీపీలు పెరిగి దాడి చేసి ఉంటారు.. అందులో తప్పేముంది”… అని టీడీపీ ఆఫీసుపై.. పట్టాభిరాం ఇంటిపై.. దాడులు చేసి బీభత్సం సృష్టించినప్పుడు జగన్మోహన్ రెడ్డి సమర్థించుకున్నారు. సీఎం హోదాలో ఉండి దాడుల్ని సమర్థించిన ఘోరమైన మనస్థత్వమున్న ముఖ్యమంత్రిగా నిలిచిపోయారు. వైసీపీ హయాంలో ఎన్ని టీడీపీ ఆఫీసులు తగలబడ్డాయో.. ఎన్ని టీడీపీ నేతల ఇళ్లు అగ్నికి అహుతయ్యాయో.. ఎంత మంది ఆస్తులు ధ్వంసమయ్యాయో లెక్కలు తీస్తే వైసీపీ నేతలు ఎంత ఘోరంగా వ్యవహరించేవారో అర్థమవుతుంది.
అప్పట్లో అసలు భోషడికే అని పట్టాభిరాం తిట్టింది జగన్ రెడ్డిని కాదు. సజ్జలను. ఆ విషయం అందరికీ తెలుసు. అయినా జగన్ రెడ్డి నన్నే తిట్టారని చెప్పుకున్నారు. దానికో ఘోరమైన అర్థాన్ని కూడా తానే చెప్పుకున్నారు. భోషడీకేకు ఆ అర్థం ఉందని ఎవరికీ తెలియదు. నార్త్ లో సినిమాలకు పేర్లు పెట్టుకున్నారు. పాటలు కూడా పాడుకున్నారు. అయినా జగన్ రెడ్డి తన తల్లిని కించ పరిచేలా.. తనను అనని తిట్టును అన్వయించుకుని టీడీపీనేతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేయించి మానసిక ఆనందం పొందారు. తన చేతుల్లో ఉన్న పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేశారు.
ఇప్పుడు పదవి పోయినా మహిళల్ని అత్యంత దారుణంగా కించ పరుస్తూనే ఉన్నారు. నల్లపురెడ్డి ఇంటిపై మహిళలు దాడి చేశారు. ధ్వంసం చేశారు. ఇప్పుడు వైసీపీ నీతులు చెప్పడం ప్రారంభించింది. అలా మాట్లాడినందుకు ఇప్పటికీ ఆయనకు పశ్చాత్తాపం లేదు. అసలు ఘోరంగా మాట్లాడటం.. దాడులు చేయడం అనే సంస్కృతికిని ప్రారంభించింది వైసీపీ. దానికి ఇప్పుడు ప్రతిఫలం అనుభవిస్తోంది. ప్రజాస్వామ్యంలో దాడులు ఎప్పటికీ సమర్థనీయం కాదు.. అలాగే ఘోరమైన మాటలు కూడా. అనకుండానే అన్నట్లుగా అన్వయించుకుని బీపీలు తెచ్చుకున్నప్పటి ఘటనల్ని గుర్తుకు తెచ్చుకుని తమను తాము కరెక్ట్ చేసుకుంటే.. వైసీపీ నేతలకు భవిష్యత్ లో ఇలాంటి పరిణామాలు ఎదురు కాకుండా ఉంటాయన్న సూచనలు వినిపిస్తున్నాయి.