కేసీఆర్ “రండ” రచ్చ !

తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం బీజేపీని కిషన్ రెడ్డిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. కేంద్రం ధాన్యం కొనబోమని చెప్పిందని .. కానీ కిషన్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. అయన తిట్లలో ఓ చోట “రండ” అనే పదం వచ్చింది. ఇలాంటి దద్దమ్మ.. “రండ” మంత్రి మనకు అవసరమా అన్నారు. ఆయన అప్పుడు ఏమన్నారో చాలా మందికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు మెల్లగా ఆ “రండ” పదంపై రచ్చ ప్రారంభమయింది. “రండ” అనే పదం తెలంగాణ పల్లెల్లో వాడే అత్యంత దారుణమైన తిట్టు అని .. అలాంటి పదాన్ని ముఖ్యమంత్రి.. ఓ కేంద్రమంత్రిపై వాడటం ఏమిటనే ప్రశ్నలు వినిపించడం ప్రారంభమయ్యాయి.

కేసీఆర్ నాలుకకు, మెదడుకున్న నరం కట్ అయ్యినట్లుంది. సిగ్గుండాలని బండి సంజయ్ మండిపడ్డారు. ఆ భాషను చూసి జనం నవ్వుకుంటున్నరు. కేసీఆర్ సెన్సార్ భాష వాడుతున్నడు. రండ, పిచ్చి గాడిద కొడుకులు, బేవకూఫ్, నా కొడకా అంటూ మాట్లాడుతున్నాడని..ఏ భాష నేర్పుతున్నవ్ తెలంగాణ సమాజానికి అని ప్రశ్నించారు. ఢిల్లీకి వచ్చిపోయినంక కేసీఆర్ కు పిచ్చి ముదిరినట్లుంది. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి హద్దు మీరి దిగజారి కేంద్ర మంత్రిని పట్టుకుని మాట్లాడారని..కేసీఆర్ నోటిని ఫినాయిల్ తో ఇనుప బ్రష్ పెట్టి గీకినా బాగుపడదు. మేం మాట్లాడితే నీ తలకాయ యాడ పెట్టుకుంటావని బండి సంజయ్ ప్రశ్నించారు.

సోషల్ మీడియాలో కేసీఆర్ తిట్లపై చర్చ ప్రారంభమయింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలా మాట్లాడకూడదని కొంత మంది వాదిస్తూంటే.. మరికొంత మంది అసలు రండ అనే పదానికి అర్థమే లేదని.. ఏపీలో బోస్డికే అనే పదంపై జరిగిన రచ్చను గుర్తు చేస్తున్నారు. ఏమీ అర్థం లేకపోయినా అక్కడ రాజకీయం.. ఆ పదానికి బూతు అర్థం తీసుకున్నారని.. ఇక్కడ కూడా లేని అర్థాన్ని తీసుకని బీజేపీ నేతలు రచ్చ చేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి తెలంగాణలోనూ తిట్ల రాజకీయం ఊపందుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పవన్ ఫ్యాన్‌పై రాజద్రోహం, యుద్ధం కేసులు … బెయిలిచ్చిన కోర్టు!

ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్వామిభక్తిలో ఎవరూ అందుకోనంత స్థాయికి వెళ్లిపోయారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని జనసేన సానుభూతి పరుడైన ఓ యువకుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు అతనిపై పెట్టిన సెక్షన్లు చూసి న్యాయమూర్తే...

తెరపైకి మళ్లీ దళిత బంధు !

హుజురాబాద్ ఎన్నికలు అయిపోయిన రెండున్నర నెలల తర్వాత దళిత బంధు పథకం విషయంలో కేసీఆర్ మరో ప్రకటన చేశారు. నిజానికి గత డిసెంబర్‌లోపే హుజురాబాద్‌తో పాటు నాలుగు దిక్కులా ఉన్నా నాలుగు మండలాల్లో...

“బండి”కి న్యాయం.. నాకు అన్యాయమా ?: రఘురామా

బండి సంజయ్‌పై పోలీసుల దాడిని లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ సీరియస్‌గా తీసుకుంది. ఆ ఘటనకు కారణమైన వారందర్నీ పిలిపించి ప్రశ్నించబోతోంది. ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఈ విషయం తెలంగాణలో హాట్ టాపిక్...

గుడివాడ కేసినో ఆధారాలు రిలీజ్ చేసిన టీడీపీ !

గుడివాడలో కేసినో నిర్వహించామని నిర్వహిస్తే అక్కడే పెట్రోల్ పోసి నిప్పంటించుకుంటానని మంత్రి కొడాలి నాని సవాల్ చేశారు. అయితే కేసినో నిర్వహించారన్నదానికి అన్ని ఆధారాలూ సమర్పిస్తామని టీడీపీ చెబుతోంది. ముందుగా కేసినో నిర్వాహకులు.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close