షరతులు…సలహాలు…ఆదేశాలు…ఇపుడు జోక్యాలు? అప్పుతీసుకునే రాష్ట్రాలతో ప్రపంచబ్యాంకు ధోరణి !

భూములను కార్పొరేట్లకు చౌకగా ఇవ్వడానికి ‘ల్యాండ్‌ బ్యాంక్‌ అవైలబులిటీ’ ఆన్‌లైన్‌లో ఉండాలని జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ -జిఐఎస్‌ విధానం ద్వారా దీనిని అమలు చేయాలని ప్రపంచబ్యాంకు భారతదేశంలో రాష్ట్రాలకు ఒక నివేదిక ద్వారా సూచించింది. ఈ దేశంలో పరిశ్రమలకు, వ్యాపారానికి భూమి లభ్యత ఒక పెద్ద ఆటంకంగా ఉందని ఈ నెల 14న విడుదల చేసిన ‘అసెస్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ ఇంప్లిమెంటేషన్‌ ఆఫ్‌ బిజినెస్‌ రిఫామ్స్‌’ నివేదికలో ప్రపంచబ్యాంకు పేర్కొంది. పెట్టుబడులకు అనువైన రాష్ట్రాల్లో గుజరాత్ మొదటిస్ధానంలో , ఆంధ్రప్రదేశ్ రెండో స్ధానంలో వున్నాయని మీడియా ఒకరోజంతా ఊదరగొట్టిన విషయానికి మూలం ఈ నివేదికే. నివేదిను పూర్తిగా పరిశలిస్తే దేశ, రాష్ట్రాల అంతర్గత వ్యవహారాల్లో ప్రపంచబ్యాంక్ సూచనల పేరుతో ఆదేశాలే ఇస్తున్నట్టు అర్ధమౌతోంది. అప్పు ఇచ్చేవాళ్ళు షరతులు పెట్టడం అసంబద్ధమేమీకాదు. అదేసమయంలో అది మన స్వతంత్రతకు, రాజ్యాంగంలోని ఫెడరల్‌ స్ఫూర్తికి భంగకరంకూడా. కేంద్రంలో,రాష్ట్రాల్లో ఏ పార్టీవారు అధికారంలో వున్నా ప్రపంచబ్యాంకు షరతులగురించి దాచిపెట్టి జనసంక్షేమానికి కఠిన నిర్ణయాలు తప్పవని ఉపన్యాసాలు ఇస్తున్నారు. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య సంస్ధల షరతులప్రకారమే తాము పధకాలు అమలు చేస్తున్నామని చెప్పిన ప్రధానమంత్రి గాని, ముఖ్యమంత్రిగాని ఒక్కరూలేరు.

ఏమైనాకానీ, ప్రపంచబ్యాంకు నుంచి వ్యవసాయ రంగానికి హానికలలిగించే ప్రత్యక్షసూచనలే ఎక్కువగావున్నాయి. వ్యవసాయమే ప్రధాన ఆధారమైన సువిశాల భారతదేశం వీటిని ఏకపక్షంగా అమలు చేసేస్తే జీవనాధారాలే మౌలికంగా తెగిపోతాయి. బక్కరైతులు, రైతుకూలీలు నగరాల్లో పట్టణాల్లో సెక్యూరిటీ గార్డులైపోయి ధీమాపోయిన దిగులుతో బతికేస్తూండటం మనం చూస్తూనే వున్నాం! ఈ నేపధ్యం వల్లనే పెట్టుబడుల సమీకరణలో విదేశీ విధానాలను పక్కనపెట్టి భారతీయ నమూనాను రూపొందించుకోవాలని బిజెపికి మాతృసంస్ధ ఆర్ ఎస్ ఎస్ సూచించింది. భారతదేశంలో పరిశ్రమలకు, వ్యాపారానికి భూమి లభ్యత ఒక పెద్ద ఆటంకంగా ఉందని నివేదిక పేర్కొంది.భూమి కేటాయింపు, నిర్మాణ అనుమతుల మంజూరులో మధ్యప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ ఐదో స్థానంలో ఉంది. సంస్కరణలు రాష్ట్ర స్థాయిలో అమలు జరగాలని, అందుకు రాష్ట్రాల స్థాయిలో ప్రభుత్వ నియంత్రణలను తగ్గించడం ముఖ్యమని సూచించింది.

సంస్క రణల ప్రభావం, దాని లబ్ధిదారులైన ప్రైవేటురంగం పూర్తిగా గుర్తించేటట్లు కార్యాచరణ ఉండాలని నివేదిక స్పష్టం చేసింది.
ప్రభుత్వ శాఖలు సమర్థవంతంగా వ్యవహరించ డంలేదని, సిబ్బంది తగినంతమంది లేరని, అన్ని సంస్థలను రెగ్యులర్‌గా పూర్తి స్థాయిలో తనిఖీ చేసే సామర్థ్యం లేదని తెలిపింది. పరిశ్రమలకు సొంత సర్టిఫికెట్‌తో అనుమతి వ్వాలని చెప్పింది. ఫాక్టరీలలో భద్రతలకు సంబంధించి తనిఖీలు కూడా లేకుండా థర్డ్‌పార్టీ సర్టిఫికెట్‌ ఆధారంగా అనుమతులు మంజూరు చేయాలని పేర్కొంది. ఇప్పటికే జార్ఖండ్‌లో సొంత సర్టిఫికెట్‌ ఆధారంగా రెన్యువల్‌, రిటర్న్స్‌ అనుమతిస్తున్నారు. 14 కార్మిక చట్టాలకు సంబంధించిన అన్ని తనిఖీలూ ఎత్తివేసి ఐదేళ్లకొకసారి, ఒక్కరోజునే తనిఖీ చేసేలా విధానం రూపొందించడం ఆదర్శమని నివేదికలో ప్రశంసించారు. విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వడానికి ముందు డిస్కం లేదా ప్రభుత్వ అధికారులు తనిఖీలు చేయకుండా, దానిని కూడా థర్డ్‌ పార్టీకి అప్పగించాలని పేర్కొంది.

చెక్‌పోస్టుల్లో ప్రతి వాహనాన్నీ తనిఖీ చేయడం కష్టమని, వ్యాపారులు ‘వే బిల్స్‌’ జనరేట్‌ చేసి ఆన్‌లైన్‌లోనే పన్ను కట్టే విధానాన్ని అమలు చేయాలని పేర్కొంది. అప్పుడప్పుడు, అక్కడక్కడా తనిఖీలు చేస్తే సరిపోతుందని సూచించింది. ఇలా అయితే రవాణాకు సమయం కూడా కలిసొస్తుందని చెప్పింది. కేవలం ఫిర్యాదు వచ్చిన పరిశ్రమలు, వ్యాపారాల పైనే తనిఖీలు నిర్వహించాలని సూచించింది. తనిఖీ చేసే సిబ్బందిఆ శాఖ ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి పొందాలని కూడా పేర్కొంది. ఇలా అయితే ఇన్‌స్పెక్టర్లపై పని భారం తగ్గు తుందని సలహా ఇచ్చింది. కార్మిక శాఖలో 10 రకాల తనిఖీ లను విడివిడిగా కాకుండా, ఒకేసారి చేయాలని సూచించింది. దీనివల్ల పరిమితంగా ఉన్న ఇన్‌స్పెక్టర్లపై పనిభారం తగ్గుతుందని తెలిపింది. సింగిల్‌ విండో విధానం పంజాబ్‌లో మాత్రమే పూర్తి స్థాయిలో అమలవుతోంది. దీన్ని అన్ని రాష్ట్రాల్లో నిర్దిష్ట కాల వ్యవధిలో అనుమతులిచ్చేలా విధానాలు రూపొందించాలని పేర్కొంది. భూమి రికార్డులు డిజిటలైజ్‌ చేయాలని, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జోనల్‌ స్థాయి వరకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పింది. డిజిటలైజ్‌ భూమి రికార్డులు సబ్‌ రిజిస్ట్రార్‌, రెవెన్యూ, మున్సిపల్‌ ఆఫీసుల్లో అందుబాటులో ఉండాలని పేర్కొంది. ఈ మూడు డేటా బేస్‌ల ఇంటిగ్రేషన్‌ ఇంకా మన దేశంలో జరగాల్సి ఉందని తెలిపింది. ప్రధానంగా మున్సిపల్‌ స్థాయిలో ఇంటిగ్రేషన్‌ విషయంలో చాలా వెనకబడి ఉన్నా మని, మహారాష్ట్ర, రాజస్థాన్‌లలోనే మూడు విభాగాల ఇంటిగ్రేషన్‌ పూర్తయిందని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌ సహా మరో 11 రాష్ట్రాల్లో రెవెన్యూ, రిజిస్ట్రార్‌ కార్యాలయాల డేటా బేస్‌ ఇంటిగ్రేట్‌ అయ్యాయి. నివేదిక పేరుతో ర్యాంకులిచ్చి అన్ని రాష్ట్రాల్లో సంస్కరణల అమలు వేగాన్ని పెంచడానికి ప్రపంచ బ్యాంకు ప్రయత్నిస్తోంది. గతంలో అప్పులు తీసుకున్న రాష్ట్రాలకు, అది కూడా ఆ ప్రాజెక్టు సంబంధిత శాఖలతోనే వ్యవహరించే ప్రపంచబ్యాంకు, సంస్కరణల అమలు పేరుతో రాష్ట్రాల్లోని అనేక శాఖలపై పెత్తనం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రపంచ బ్యాంకు చేపట్టిన ”డూయింగ్‌ బిజినెస్‌” రిపోర్టు ప్రకారం 189 దేశాల్లో భారత్‌ 142వ స్థానంలో ఉంది. 2014లో 140వ స్థానంలో ఉన్నదల్లా 2015కు మరో రెండు స్థానాలు దిగజారిపోగా, 2017 కల్లా ఏకంగా 50వ స్థానానికి ఎదగడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు నివేదిక పేర్కొంది. ఈ లక్ష్యసాధనకోసం ప్రపంచబ్యాంకు షరతులు, సలహాలు, ఆదేశాల దశ దాటి ప్రభుత్వం శాఖల్లో జోక్యం చేసుకునేవరకూ తెగబడినట్టు అనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లూసీఫ‌ర్‌’కి మ‌ళ్లీ రిపేర్లు

మ‌ల‌యాళ `లూసీఫ‌ర్‌`ని తెలుగులో `గాడ్ ఫాద‌ర్‌`గా రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి క‌థానాయ‌కుడు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. ఈ సినిమా షూటింగ్ అధికారికంగానూ మొద‌లైంది. అయితే.. మ‌ళ్లీ బ్రేక్ వ‌చ్చి ప‌డింది....

శేఖ‌ర్ క‌మ్ముల జోన‌ర్ మార్చాల‌ని అనుకుంటున్నాడా?

శేఖ‌ర్ క‌మ్ముల అన‌గానే ఓ ర‌క‌మైన సినిమాలు గుర్తొస్తాయి. ఆనంద్‌, గోదావ‌రి, హ్యాపీడేస్‌, ఫిదా.. ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాలే క‌ళ్ల‌ముందు మెదులుతాయి. త‌న‌పై కూడా అలాంటి ముద్రే ఉంది. ఫీల్ గుడ్...

మ‌హేష్ వ‌ద్ద‌న్న క‌థ‌తోనే..!

విజ‌య్‌తో వంశీ పైడిప‌ల్లి ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత‌. ఈ సినిమా కోసం విజ‌య్ ఏకంగా వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్న‌ట్టు టాక్‌. క‌థ కూడా ఓకే...

శంక‌ర్ సినిమా: ట్రైన్ ఎపిసోడ్ అదిరిపోద్దంతే!

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ట్రైన్ ఎపిసోడ్ అంటే.. `న‌ర‌సింహ‌నాయుడు` చ‌టుక్కున గుర్తొస్తుంది. బాల‌కృష్ణ పౌరుషానికి మ‌ణిశర్మ బీజియం, బి.గోపాల్ టేకింగ్ ఇవ‌న్నీ ఆ సీన్‌ని, ఎమోష‌న్‌నీ ప‌తాక స్థాయిలో నిల‌బెట్టాయి. ఆ...

HOT NEWS

[X] Close
[X] Close