రియల్ ఎస్టేట్ మార్కెట్ భిన్నమైనది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆ రంగం గొప్పగా ఉండాలనేం లేదు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్ ఉన్న దేశం మొనాకో. 2025లో ఇక్కడ చదరపు మీటర్ సగటు ధర 56,500 డాలర్లకు చేరింది. అంటే మన రూపాయల్లో 47 లక్షల రూపాయలు.
ఇది హాంకాంగ్, లండన్ వంటి ఇతర నగరాలను మించిపోయింది. పరిమిత స్థలం, పన్ను రహిత వ్యవస్థ , ధనవంతుల ఆకర్షణ కారణంగా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రెంటల్ మార్కెట్ కూడా అత్యంత ఖరీదైనది, సగటు రెంట్ న్యూయార్క్ కంటే 12% ఎక్కువ.
న్యూయార్క్ సెంట్రల్ పార్క్ కంటే సగం పరిమాణంలో ఈ దేశం ఉంటుంది. సముద్రం, పర్వతాల మధ్య ఉండటం వల్ల ప్రత్యేకంగా ఉంటుంది. పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. వ్యక్తిగత ఆదాయ పన్ను లేదు, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లేదు, వార్షిక ప్రాపర్టీ ట్యాక్స్ లేదు. అందుకే ధనవంతులను మొనాకో ఆకర్షిస్తోంది. ఇది సేఫ్ హెవెన్‌గా పేరుపొందింది, అల్ట్రా-హై-నెట్-వర్త్ వ్యక్తులు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు.
మోనాకో ధరలు హాంకాంగ్ కంటే రెట్టింపు. రెంటల్స్‌లో న్యూయార్క్ కంటే 12% ఎక్కువ, లండన్ కంటే 146% ఎక్కువ, హాంకాంగ్ కంటే 52% ఎక్కువ. న్యూయార్క్ లేదా పారిస్ కంటే 100-200% ఎక్కువ ధరలు. అయితే మోనాకోలో ప్రాపర్టీ కొనడానికి రెసిడెన్సీ అవసరం. అక్రమ సంపాదనతో ఆస్తులు కొనలేరు.