నిర్మాత‌గా బుర్రా సాయిమాధ‌వ్

తెలుగులో డైలాగ్ రైట‌ర్‌గా కొన‌సాగుతున్నారు బుర్రా సాయి మాధ‌వ్‌. స్టార్ హీరోల సినిమాల‌న్నీ దాదాపుగా ఆయ‌న చేతుల్లోనే ఉన్నాయి. ప్ర‌స్తుతం అత్య‌ధిక పారితోషికం అందుకొంటున్న డైలాగ్ రైట‌ర్ ఆయ‌నే. బుర్రా త్వ‌ర‌లోనే మెగా ఫోన్ ప‌డ‌తార‌న్న వార్త‌లు ఆమ‌ధ్య కాలంలో హోరెత్తాయి. బుర్రా కూడా ద‌ర్శ‌క‌త్వంపై త‌న ఇష్టాన్ని చాలా సంద‌ర్భాల్లో తెలియ‌జేశారు. 2024లో బుర్రా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం ఖాయం అనుకొంటున్న త‌రుణంలో.. ఆయ‌న మ‌రో కొత్త నిర్ణ‌యాన్ని తీసుకొన్నారు. త్వ‌ర‌లోనే ఆయ‌న నిర్మాణ రంగంలో అడుగు పెట్ట‌నున్నారు.

నిర్మాత‌గా ఓ కొత్త ద‌ర్శ‌కుడ్ని ప‌రిచ‌యం చేస్తూ ఓ సినిమా తీయ‌బోతున్నారు. ఇప్ప‌టికే బ్యాన‌ర్ పేరు ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో రిజిస్ట‌ర్ చేయించేశారు. క‌థ లాక్ అయిపోయింది. ప్ర‌స్తుతం న‌టీన‌టుల ఎంపిక జ‌రుగుతోంది. మ‌రోవైపు లొకేష‌న్ల‌నీ ఫైన‌ల్ చేసుకొంటున్నారు. ఈ చిత్రానికి నిర్మాత‌గానే కాకుండా, బుర్రా ర‌చ‌యిత‌గానూ ప‌ని చేయ‌బోతున్న‌ట్టు టాక్‌. త్వ‌ర‌లోనే బ్యాన‌ర్ పేరు, ద‌ర్శ‌కుడి వివ‌రాలూ అధికారికంగా ప్ర‌క‌టిస్తారు. ఇప్పుడు నిర్మాత‌గా ఓ మెట్టు ఎక్కిన బుర్రా.. త్వ‌ర‌లోనే మెగాఫోన్ ప‌ట్టి ఆ గోల్ కూడా చేరుకొంటారేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జనసేనను రెచ్చగొట్టే ప్లాన్ ఫెయిలయిందని వైసీపీ గగ్గోలు !

టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదరకూడదని.. పొత్తు కుదిరినా రెండు పార్టీల సీట్ల పంచాయతీ పెట్టాలని చాలా కాలంగా వైసీపీ వ్యూహకర్తలు చేస్తున్న ప్రయత్నాలన్నీ తేలిపోయాయి. సీట్ల సర్దుబాటు .. అభ్యర్థుల ప్రకటన...

ఇలాగైతే ర‌ధ‌న్‌కి క‌ష్ట‌మే!

టాలీవుడ్ లో ప్ర‌తిభావంతులైన సంగీత ద‌ర్శ‌కుల‌కు కొద‌వ లేదు. కీర‌వాణి, త‌మ‌న్‌, దేవిశ్రీ‌ల‌తో పాటు భీమ్స్, మిక్కీ జే మేయ‌ర్ లాంటివాళ్లు అందుబాటులో ఉన్నారు. ర‌ధ‌న్ పేరు కూడా బాగా పాపుల‌ర్‌. చిన్న‌,...

ఫస్ట్ లిస్ట్ : టీడీపీ – జనసేన యుద్ధానికి సిద్ధం !

సిద్ధం సిద్ధం అని జగన్ రెడ్డి అరుస్తూనే ఉన్నారు. జాబితాల మీద జాబితాలు విడుదల చేస్తున్నారు. ఒక జాబితాలో ఉన్న వారి పేరు మరో జాబితాలో మార్చేస్తున్నారు. ఒక్క ఎంపీ అభ్యర్థి...
video

‘స‌రిపోదా శ‌నివారం’ గ్లింప్స్‌: క్ర‌మ‌బ‌ద్ధ‌మైన కోపం

https://www.youtube.com/watch?v=jS0_9pfvixo&list=PLgCNTKEOcOc6ktQjMOqJQ68e0UlEb2bJD&index=2 ఎప్పుడూ కొత్త త‌ర‌హా క‌థ‌లు, వెరైటీ క్యారెక్ట‌రైజేష‌న్స్ తో క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఉన్న ప్ర‌యోగాలు చేస్తుంటాడు నాని. త‌న కొత్త సినిమా 'స‌రిపోదా శ‌నివారం' కూడా అలాంటి ప్ర‌య‌త్న‌మే. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close