జయలలిత బయోపిక్ తలైవి ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉండేవి. అయితే… విడుదలయ్యాక అవన్నీ నీరుగారిపోయాయి. తమిళనాట కూడా ఈ సినిమాని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. విజయేంద్ర ప్రసాద్ లాంటి రచయిత ఉన్నా – ఎలివేషన్లు సరిగా లేవని, కమర్షియల్ సినిమా ఫార్మెట్లో ఈ సినిమా సాగింది తప్ప, జయలలిత జీవిత కథలా లేదని విమర్శలొచ్చాయి. అయితే… ఈ సినిమా విషయంలో విజయేంద్ర ప్రసాద్ సైతం అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఆయన రాసిన సీన్లు చాలా మట్టుకు ఈ సినిమాలో లేవని, విజయ్ మరికొంతమంది రైటర్లతో వేరే వెర్షన్లు రాయించుకున్నాడని, రిలీజ్ అయిన రోజే… విజయ్‌తోనూ, నిర్మాతలతోనూ విజయేంద్ర ప్రసాద్ తన సంతృప్తిని వెళ్లగక్కారని ఇన్‌సైడ్ వర్గాల టాక్. ఈ సినిమా కోసం విజయేంద్ర ప్రసాద్ కి దాదాపు కోటి రూపాయల పారితోషికం ఇచ్చారు. కోటి ఇచ్చి, రచయితని పెట్టుకుని, ఆయన రాసిన సీన్లు పక్కన పెట్టి, వేరే వెర్షన్ రాయించుకున్నారంటే.. విజయ్ ని ఏమనాలి? ఈ సినిమా చుట్టూ చాలా వివాదాలు తిరిగాయి. ఇప్పుడు బడ్జెట్ విషయంలోనూ విజయ్ పై నిర్మాతలు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. అనుకున్న బడ్జెట్ కీ, చివరికి తేలిన బడ్జెట్ కీ చాలా తేడా ఉందని, విజయ్ అందుకున్న పారితోషికంలో కొంత భాగం వెనక్కి తీసుకునేలా నిర్మాతలు ఒత్తిడి తీసుకొస్తున్నారని సమాచారం.