విచారణ పూర్తయితే కాంగ్రెస్ లో సగం మంది జైలుకే పోతారుట!

ప్రస్తుతం తెలంగాణాలో కాంగ్రెస్, తెరాసల మధ్య ఇందిరమ్మ ఇళ్ళు అంశంపై జరుగుతున్న మాటల యుద్ధంలో చాలా ఆసక్తికరమయిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. “తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత పేద ప్రజలను ఆదుకొంటుందని అందరూ ఆశిస్తే తమ హయాంలో పేదలకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ళ తాలూకు బిల్లులు నేటికీ చెల్లించకుండా తెరాస ప్రభుత్వం త్రొక్కి పట్టి ఉంచిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెరాస ప్రభుత్వం వాటిని మంజూరు చేస్తే కాంగ్రెస్ పార్టీకే మంచిపేరు, ప్రజలలో ఆదరణ పెరుగుతుందనే భయంతోనే ఏడాది గడిచినా ఇంకా బిల్లులు చెల్లించకుండా పేద ప్రజలని ఇబ్బంది పెడుతోందని ఆయన ఆరోపించారు.
ఒక ప్రభుత్వం మంజూరు చేసిన పధకాలను మరొక ప్రభుత్వం కొనసాగించినప్పుడే ప్రజలకు ప్రభుత్వాల మీద విశ్వాసం నిలుస్తుంది. కానీ ప్రభుత్వాలు మారగానే పేదల చేతిలో ఉన్నదానిని కూడా వారికి దక్కకుండా చేస్తే ప్రభుత్వాల మీద ప్రజలు నమ్మకం కోల్పోతారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా అదే జరుగుతోందని స్పష్టమవుతోంది.
కానీ ఉత్తమ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఆర్మూరు తెరాస ఎమ్మెల్యే ఏ. జీవన్ రెడ్డి చాలా ఘాటయిన సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ హయంలో ఇందిరమ్మ ఇళ్ళ పేరిట కాంగ్రెస్ నేతలే అనేక అక్రమాలకూ పాల్పడ్డారని, అనేక చోట్ల అసలు ఇళ్ళ నిర్మాణం చేయకుండానే ఇళ్ళు కట్టినట్లు కాగితాల మీద చూపించి సొమ్ము దిగమింగారని, కొన్ని చోట్ల గ్రామాలలో ఉన్న జనాభా కంటే అధికంగా ఇళ్ళు కట్టినట్లు చూపించి ప్రభుత్వం ధనం బొక్కేసారని, ఆ ఆక్రమాలపై విచారణ పూర్తయితే కాంగ్రెస్ నేతల్లో సగం మంది జైలుకి వెళ్ళవలసి వస్తుందని ఆయన అన్నారు. అంటే కాంగ్రెస్ నేతలు పేదల పేరు చెప్పుకొని అక్రమాలకు పాల్పడటం కూడా నిజమేనని స్పష్టం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేంద్రం – కేజ్రీవాల్ మధ్యలో రాకేష్..!

ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా రాకేష్ ఆస్థానా అనే అధికారిని మోడీ సర్కార్ నియమించడం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఆయనను తక్షణం పదవి నుంచి తప్పించాలని కేజ్రీవాల్ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఢిల్లీకి...

మీడియా వాచ్ : తెలుగులో ఏబీపీ డిజిటల్..! పెరుగుతున్న ఉత్తరాది ప్రాబల్యం..!

తెలుగు మీడియా రంగంలో ఉత్తరాది ప్రాబల్యం పెరుగుతోంది. గతంలో తెలుగు మీడియాకు సంబంధించి పత్రికలైనా.. టీవీ చానళ్లు అయినా తెలుగు వారే ప్రారంభించేవారు. గతంలో ఉత్తదారికి చెందిన పెద్ద పెద్ద సంస్థలు మీడియా...

పెట్రో కంపెనీల్నీ అమ్మేస్తున్న కేంద్రం..!

పెట్రో పన్నులు పెంచుతూ ప్రజల వద్ద నుంచి లక్షల కోట్ల ఆదాయం కళ్ల జూస్తున్న కేంద్రం.. ఇప్పుడు ఆ కంపెనీలను కూడా అమ్మకానికి పెట్టేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలా వంద...

హుజూరాబాద్‌లో అసలు కన్నా ఫేక్ ప్రచారాలే ఎక్కువ..!

హుజూరాబాద్ ఉపఎన్నిక రాజకీయాల్లో పెరిగిపోతున్న మకిలీ మొత్తాన్ని బయట పెడుతూనే ఉంది. అసలు షెడ్యూలే రాలేదు.. ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అయినప్పటికీ.. రాజకీయ పార్టీలు.. అన్ని రకాల తెలివి తేటల్నీ ప్రదర్శిస్తున్నాయి....

HOT NEWS

[X] Close
[X] Close