జిన్‌పింగ్‌కే తప్పడం లేదు…!

అధికారం శాశ్వతం అనుకునే వాళ్లకి ఎప్పటికప్పుడు కళ్లు తెరిపించే ఘటనలు ప్రపంచంలో ప్రతీ చోటా జరుగుతూనే ఉన్నాయి. నాటి హిట్లర్ నుంచి చెప్పుకుంటూ వస్తే.. మన కళ్ల ముందే చూసిన సద్దం హుస్సేన్, ముషారఫ్ లాంటి వాళ్లను దాటుకుని ఇప్పుడు ఆ జాబితాలో జిన్ పింగ్ కూడా చేరుతున్నారు. చైనాలో ఆయన రాజ్యంగ సవరణ కూడా చేసుకుని శాశ్వత అధ్యక్షునిగా ప్రకటించుకున్నారు. అక్కడ వ్యతిరేకించడానికి.. రూల్స్ చెప్పడానికి ఎన్నికల సంఘాల్లాంటివి కూడా లేవు. జిన్‌పింగ్ ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది. కానీ అలాంటి జిన్ పింగ్ పరిస్థితి ఇప్పుడు తలకిందులయింది.

జిన్ పింగ్ తనకు ఎదురు లేదనుకుంటారు. అక్కడ వేరే పార్టీ ఉండదు. సొంత పార్టీలోనే ఎవరైనా ఎదురు తిరిగితే మరణశిక్షలు విధిస్తారు . తన విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడితే వేల కోట్ల సామ్రాజ్యాలనైనా కుప్పకూల్చేస్తారు. జాక్ మా ఉదంతమే మనకు తెలిసింది. తెలియనివి చాలా ఉంటాయి. అసలు ఎన్నికలే ఉండని ఆ దేశంలో జిన్ పింగ్‌కు ఎదురు ఉండదని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడేమవుతుంది. అంచనా వేయడం కష్టం. చైనాలో పరిస్థితులు బయటకు తెలియడం లేదు కానీ.. ఏం జరుగుతుందో అంచనా వేయడం కష్టం.

నియంతృత్వంలో ఉన్న వారి పరిస్థితే అలా ఉంటే.. ఇక ప్రజాస్వామ్యంలో ఉన్న వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారి అధికారాన్నిప్రజలు ఎప్పుడైనా పీకేస్తారు. వాళ్లిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్లనే బెదిరించి.. భయపెట్టి పాలన సాగించి మళ్లీ అదే పద్దతిలో ఓట్లు వేయించుకుంటామనుకుంటే అంతకంటే అమాయకులు ఉండదు. కానీ అధికారం నెత్తికెక్కిన వారు ఏదైనా సాధ్యమే అనుకుంటారు. అధికారం పోయిన తర్వాతే తత్వం బోధఫడుతుంది. కానీ ఆ తర్వాత అనుభవించాల్సినవి ఎక్కువ ఉంటాయి. అది తెలుసుకోని అప్రకటిత నియంతలకు ఎప్పటికైనా గడ్డుకాలమేనని జిన్ పింగ్ ఉదంతం మరోసారి నిరూపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close