ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు డిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయబోతున్నారు. ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు దీక్ష చేయడానికి డిల్లీ పోలీసులు అనుమతించారు. ఈ దీక్ష కోసం రాష్ట్రం నుండి రెండు ప్రత్యేక రైళ్ళలో పార్టీ కార్యకర్తలను డిల్లీకి తరలించారు. ప్రత్యేక హోదా గురించి ఇంతకు ముందు కూడా వైకాపా పోరాడిన్నప్పటికీ, ఏకంగా డిల్లీలోనే పోరాటం చేయడం ఇదే మొదటిసారి. మరి ఇంతకాలం ఆయన ఎందుకు దీని గురించి గట్టిగా పోరాడలేదో తెలియదు కానీ ఇక నుండయినా ప్రత్యేక హోదా కోసం పోరాడుతారో లేదో వేచి చూడాలి. అధికారంలో ఉన్న తెదేపా ప్రత్యేక హోదాపై జవాబు చెప్పుకోలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి కనుక ఆయన (తెదేపాపై) తన ఈ ప్రత్యేక పోరాటాన్ని కొనసాగించే అవకాశాలున్నాయి.