చివరి కోరిక తీరకుండానే పోయిన యాకూబ్: ఇంటికి చేరిన మృతదేహం

హైదరాబాద్: ఈ ఉదయం ఉరిశిక్ష అమలుచేయబడిన యాకూబ్ మెనన్ చివరికోరిక తీరకుండానే ప్రాణాలు విడిచాడు. ఉరిశిక్ష అమలుచేసేముందు ఖైదీలను చివరికోరిక అడగటం రివాజు. యాకూబ్ తన కుమార్తె జుబేదాతో మాట్లాడలని ఉందని చెప్పాడు. అయితే దానికి సమయంలేకపోవటంతో, ఫోన్‌లో కుమార్తెతో మాట్లాడించారు. యాకూబ్‌ను అతని 53వ పుట్టినరోజునాడే, ఇవాళ ఉదయం ఏడుగంటలప్రాంతంలో ఉరితీశారు. పోస్ట్‌మార్టమ్ కార్యక్రమాలు ముగిసిన తర్వాత యాకూబ్ సోదరులు సులేమాన్, ఉస్మాన్‌లకు ఉదయం 9.30గంటల ప్రాంతంలో జైలు అధికారులు మృతదేహాన్ని అప్పగించారు. దానికిముందు, మృతదేహంతో ఎలాంటి ప్రదర్శనలూ, ఊరేగింపులూ నిర్వహించబోమని వారినుంచి లిఖితపూర్వక అంగీకారపత్రాన్ని తీసుకున్నారు. సులేమాన్, ఉస్మాన్ మృతదేహాన్ని తీసుకుని 9.45గంటలకు నాగపూర్ విమానాశ్రయంనుంచి ముంబాయికి బయలుదేరారు. 12.10గంటలకు వారు ముంబాయి చేరుకున్నారు. విమానాశ్రయంనుంచి ఇంటికి, స్మశానానికి తీసుకెళ్ళేటపుడు ఫోటోలు తీయకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం ఒంటిగంటప్రాంతంలో యాకూబ్ మృతదేహం మాహిమ్‌ ఏరియాలోని అతని ఇంటికి చేరుకుంది. మరోవైపు యాకూబ్ ఉరి సందర్భంగా దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జంధ్యాల స్టైల్‌లో `పేక మేడ‌లు`

'నా పేరు శివ', 'అంధగారం', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించిన వినోద్ కిష‌న్ ఇప్పుడు హీరోగా మారాడు. ఆయ‌న న‌టించిన 'పేక మేడ‌లు' ఈనెల 19న విడుద‌ల‌కు సిద్ధంగా...

బీజేపీలో బీఆర్ఎస్ రాజ్యసభపక్షం విలీనం ?

బీఆర్ఎస్ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనం అయ్యేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లుగా ఢిల్లీలో ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరబోతున్నారు. ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉపరాష్ట్రపతి,...
video

విజ‌య్ తెలివి.. ‘పార్టీ’ సాంగ్‌లో పాలిటిక్స్

https://www.youtube.com/watch?v=ygq_g7ceook త‌మిళ స్టార్ హీరో విజ‌య్ కొత్త‌గా పార్టీ స్థాపించిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే రాజ‌కీయ అరంగేట్రం చేయ‌బోతున్నాన‌ని, వ‌చ్చే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. రాజ‌కీయాల‌కు ముందు త‌న చివ‌రి...

పొన్నవోలు వాదన జగన్‌కైనా అర్థమవుతుందా ?

రఘురామ ఫిర్యాదుతో జగన్ తో పాటు ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కేసు నమోదయింది. ఇది తప్పుడు కేసు అని వాదించడానికి పొన్నవోలు మీడియా సమావేశం పెట్టారు. ఇందు కోసం తన టేబుల్ నిండా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close