ఇవాళ జుట్టు పట్టుకున్న వారు.. రేపు కాళ్లు పట్టుకోవాల్సి వస్తుంది..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమపై వేధింపులు పెరిగిపోయాయని భావిస్తున్న టీడీపీ నేతలకు ధైర్యం చెప్పేందుకు టీడీపీ నేతలు.. తాజా పరిస్థితులను ఉపయోగించుకుంటున్నారు. పల్నాడులో కీలక నేతగా ఉన్న యరపతినేని శ్రీనివాస్.. ఈ విషయంలో సూటిగా, సుత్తి లేకుండా… వైసీపీ నేతలకు హెచ్చరికలు పంపుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఆరిపోయే దీపం లాంటిదని… ఇవాళ జుట్టు పట్టుకున్న వారు.. రేపు కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితుల్లోకి వస్తారని హెచ్చరించారు. పాలకులు ఎప్పుడు జైలుకెళ్తారో తెలియని పరిస్థితిఏర్పడిందని గుర్తు చేశారు. ఇప్పుడు రెచ్చిపోతున్న ప్రతీ ఒక్కరి జాతకాలు మా దగ్గర ఉన్నాయని..
అందరినీ గుర్తుంచుకుంటాం ఎవ్వరినీ వదిలిపెట్టామని హెచ్చరికలు కూడా జారీ చేశారు.

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పల్నాడులో పరిస్థితులపై… టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది. చలో ఆత్మకూరు కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చింది. దాన్ని పోలీసులతో కట్టడి చేశారు కానీ.. విషయం దేశ వ్యాప్త వార్త అయింది. ఆ తర్వాత పోలీసులే.. బాధితుల్ని ఊళ్లకు తీసుకెళ్లి విడిచి పెట్టారు. వారందరితో పల్నాడులో టీడీపీ నేతలు సమావేశం నిర్వహించారు. ఒక్కో కుటుంబానికి రూ. పదివేల ఆర్థిక సాయం చేశారు. ప్రస్తుతం గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందనే అంశంపై ఆరా తశారు. జాతీయ మానవ హక్కుల సంఘం కూడా.. పరిశీలనకు రావడంతో.. ప్రస్తుతానికి ఎవరూ తమ జోలికి రావడం లేదని.. టీడీపీ నేతలకు.. బాధితులు తెలిపారు. ఈ సమావేశంలోనే పాల్గొన్న యరపతినేని అందరికీ ధైర్యం చెప్పే మాటలు చెప్పారు.

వైసీపీ హిట్‌లిస్ట్‌లో యరపతినేని కూడా ఉన్నారు. ఆయనపై వైసీపీకి చెందిన మీడియాలో అనేక కథనాలు రాశారు. కానీ కేసులు పెట్టలేకపోయారు. కోర్టులో ఉన్న అక్రమ మైనింగ్ కేసును.. సీబీఐకి ఇచ్చి… ఇరికించేశామని.. వైసీపీ నేతలు అనుకున్నారు. కానీ.. ఇంత వరకూ.. ఆ కేసును… చేపట్టాలో లేదో సీబీఐ నిర్ణయించుకోలేదు. దీతో వైసీపీ అధినాయకత్వం ఆశలు ఫలించడం లేదు. యరపతినేని చేసింది.. సీబీఐ రేంజ్ కేసు కాదన్న అభిప్రాయం.. ఉండటం… ఇప్పుడు రాజకీయం మలుపు తిరగడంతో ప్రభుత్వ సిఫార్సును సీబీఐ ఎప్పుడు ఆమోదిస్తుందో.. వేచి చూడాల్సిన పరిస్థితి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close