యాసిన్‌భత్కల్‌ను చర్లపల్లినుంచి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు విడిపిస్తారా?

హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తోన్న సిరియా ఉగ్రవాదసంస్థ ఐఎస్ఐఎస్ హైదరాబాద్ వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దిల్‌సుఖ్‌నగర్, బెంగళూరు, పూణే నగరాలలో బాంబు పేలుళ్ళు జరిపిన ఇండియన్ ముజాహదీన్ తీవ్రవాదసంస్థ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ చర్లపల్లి జైలునుంచి తప్పించుకోటానికి వ్యూహాలు పన్నుతున్నట్లు ఇటీవల బయటపడింది. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న భత్కల్ తన భార్య జహీదాకు చేసిన ఫోన్ కాల్‌ను రికార్డ్ చేయగా దిమ్మతిరిగే విషయాలు తెలిశాయి.  ఐఎస్ఐఎస్ సాయంతో త్వరలో తాను బయటకొస్తానని భత్కల్ తన భార్యకు చెప్పాడు. జైలులో ఖైదీలు మాట్లాడుకోటానికి ఏర్పాటు చేసిన అధికారిక ఫోన్‌నుంచే అతను ఈ కాల్ చేయటం విశేషం. ఈ కాల్ డేటాను జైలు అధికారులు నేర పరిశోధనాసంస్థ ఎన్ఐఏకు అందజేశారు. ఐఎస్ఐస్ సంస్థ సిరియా, ఇరాక్‌లలో సృష్టిస్తున్న విలయం అందరికీ తెలిసిందే. ఎన్ఐఏ అధికారులు చర్లపల్లి జైలు అధికారులను అప్రమత్తం చేయటంతో వారు జైలువద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. భత్కల్‌ను విడిపించటంకోసం ఎవరైనా పెద్దనేతను కిడ్నాప్ చేయటంగానీ, విమానాన్ని హైజాక్ చేయటంగానీ చేయొచ్చని ఐబీ సంస్థ గతఏడాదికూడా హెచ్చరికలు జారీచేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close