కియా క్రెడిట్ కోసం ఆత్రం..! వైసీపీ నవ్వులపాలు..!

కియా పరిశ్రమ ప్రారంభమైన ఆరు నెలల తర్వాత మరోసారి ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి. ఆయన అలా ప్రారంభించడం ఆలస్యం.. ఇలా క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు వైసీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగింది. పదేళ్ల కిందట చనిపోయిన.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కృషితో.. ఇప్పుడు.. కియా పరిశ్రమ ఏపీకి వచ్చిందని.. దాన్ని జగన్ ప్రారంభించారని.. సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు. దీంతో సోషల్ మీడియాలో ఒక్క సారిగా ట్రోలింగ్ ప్రారంభమయింది. కియా పరిశ్రమకు వ్యతిరేకంగా వైసీపీ చేసిన ఉద్యమాలు.. ఒక్క సారిగా తెరపైకి వచ్చాయి. విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు అయితే.. ఆ పరిశ్రమ మూతపడేది అని.. దివాలా అంచున ఉందని.. దాన్ని చంద్రబాబు తీసుకొచ్చి.. రాయితీలిస్తున్నారన్న ఆరోపణలు కూడా చేశారు.

నిజానికి ఎన్నికల ప్రచారంలో.. జగన్మోహన్ రెడ్డి అనంతపురం వెళ్లారు. కియా పరిశ్రమ ఉన్న పెనుగొండకు కూడా వెళ్లారు. అక్కడ ఆయన … తన తండ్రి వైఎస్ వల్ల కియా పరిశ్రమ వచ్చిందని చెప్పలేదు. కానీ… ఆ క్రెడిట్‌ను తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు కాక… నరేంద్రమోడీకి ఇచ్చారు. నరేంద్రమోడీ వల్లే ఏపీకి కియా మోటార్స్ వచ్చిందని ప్రకటించారు. అంటే.. దాదాపుగా పదేళ్ల కిందట చనిపోయిన తన తండ్రిని క్రెడిట్ ఇవ్వడానికి ఆయనకు కూడా మనసొప్పలేదు. కానీ అధికారం అందిన తర్వాత మాత్రం… తండ్రి ఖాతాలో ఆ విజయం చేరుస్తున్నారు. కియా మోటార్స్‌కు ఏపీ నుంచి ప్రతిపాదనలు వెళ్లినప్పుడు.. వైఎస్ జీవించి ఉన్నారా.. లేదా … అన్నది తర్వాతి విషయం ముందుగా తమ పార్టీకి మూలపురుషుడైన.. వైఎస్‌కు..ఎక్కడ లేని క్రెడిట్ ఇవ్వడానికి.. వైసీపీ నేతలు తాపత్రయ పడుతున్నారు.

సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటే.. నమ్మేవాళ్లు నమ్ముతారు.. తమ క్రెడిట్ తమకు వస్తుందని వైసీపీ నేతలు ఆశ పడుతున్నారు. సోషల్ మీడియా ప్రచారం వల్ల తిమ్మిని బమ్మిని చేయగలిగామని..వైసీపీ నేతల నమ్మకం. ఏపీ ప్రజల తెలివి తేటల పట్ల.. వారికి అంతు లేని నమ్మకం ఉందన్న అభిప్రాయం కూడా… ఉంది. ఈ క్రమంలో.. ఎలాంటి ప్రచారానికైనా.. వెనుకాడటం లేదు. ఈ పరిస్థితి.. ట్రోలింగ్‌కు గురవుతున్నా… వారు వెనుకాడటం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బాస్ నుండి దేవి నిష్క్రమణ, టీవీ9 పై జనాల్లో వ్యతిరేకత కూడా కారణమా ?

బిగ్ బాస్ సీజన్ 4 రికార్డు టిఆర్పీ లతో దూసుకెళుతోంది. కంటెస్టెంట్స్ జాబితా బాగోలేదు అన్న కారణంగా రెండు మూడు రోజుల తర్వాత పడిపోయిన రేటింగులు 10వ రోజు నుండి భారీగా పుంజుకున్నాయి....

పవన్ కళ్యాణ్ ఈనాడు ఇంటర్వ్యూ పై సాక్షి కొమ్మినేని ఏడుపు, ఈనాడు కి నీతులు

ఇటీవల పవన్ కళ్యాణ్ ఈనాడు పత్రికకు ఇచ్చిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూ రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. అమరావతి, జగన్ పాలన, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పై పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాలను ఆ...

గ్రేటర్ సమస్యలపై కేటీఆర్‌ని టార్గెట్ చేస్తున్న రేవంత్..!

తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల రాజకీయం రాజుకుంది. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో అంచనా వేయడం కష్టం కానీ.. రాజకీయ నేతలు మాత్రం.. వచ్చిన ఏ అవకాశాన్ని వదిలి పెట్టడం లేదు. గ్రేటర్ పరిధిలో...

ఠాగూర్ అయినా టీ కాంగ్రెస్‌లో అందర్నీ కలపి ఉంచగలరా..!?

తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా కుంతియా స్థానంలో మాణిగం ఠాగూర్‌ను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. ఆయన తెలంగాణలో అడుగు పెట్టి..ఓ సారి సమావేశం కూడా నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు.. అందరూ ఆయన ఎదుట...

HOT NEWS

[X] Close
[X] Close