కూటమితో తలపడటం సాధ్యపడటం లేదని వైసీపీ భావిస్తున్నట్టు ఉంది. అందుకే ప్రత్యర్దులుగా పోలీసులను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జగన్ నుంచి అంబటి, సజ్జల వరకు అందరూ పోలీసులపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. పోలీసులు ప్రజాస్వామ్యం ఊపిరి తీస్తున్నారంటూ పెద్ద, పెద్ద డైలాగ్ లు కొడుతున్నారు.
తెనాలిలో కానిస్టేబుల్ పై గంజా బ్యాచ్ హత్యాయత్నం చేస్తే నిసిగ్గుగా రౌడీలకు మద్దతు తెలిపారు జగన్. గంజా బ్యాచ్ ను రోడ్డు మీద కొడుతారా ? వాళ్లను గౌరవించాలి అనేలా మాట్లాడారు. జగన్ చేసిన వ్యాఖ్యలు విని వైసీపీ శ్రేణులు సైత్తం విస్తుపోయాయి. గంజా బ్యాచ్ కు మద్దతుగా మాట్లాడటమే కాకుండా పోలీసుల చర్యను తప్పుబట్టడం ఏంటని చర్చించుకున్నారు.
జగన్ కు అనధికారిక వ్యూహకర్త అయిన సజ్జల.. జగన్ డైరెక్షన్ తాను ఫాలో కాకపోతే రాంగ్ డైరెక్షన్స్ వెళ్తాయని అనుకున్నట్టు ఉన్నారు. సజ్జల కూడా పోలీసులపై చెలరేగిపోయారు. పోలీసులు అరాచక శక్తులుగా మారారు అంటూ ఆరోపించారు. క్రిమినల్ గ్యాంగ్ కు యూనిఫామ్ వేసినట్టు ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు ఏపీ పోలీసు వ్యవస్థను అవమానించేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పోలీసులు గనుక సజ్జల వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంటే ఆయనపై మరో కేసు నమోదు కావడం ఖాయం. అసలే వైసీపీ టైం బాగోలేదు. ఇలాంటి సమయంలో పోలీసులతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం ఏంటో వారికే తెలియాలి.