ఆ “రెడ్డి” కోసం ఎందాకైనా వైసీపీ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డి కోసం ఎక్కడిదాకైనా వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర రక్షణశాఖ ఉద్యోగి అయిన ధర్మారెడ్డిని డిప్యూటేషన్ మీద ఏపీకి తీసుకు వచ్చి టీటీడీ జేఈవోగా నియమించారు. ఇటీవల వరకూ ఈవోగా జవహర్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడాయని పూర్తి స్థాయిలో సీఎంవోకు వెళ్లారు. దీంతో జేఈవో ధర్మారెడ్డికే ఈవోగా అదనపు చార్జ్ ఇచ్చారు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. అదేమిటంటే ఆయన డిప్యూటేషన్ మే 14 అంటే శనివారంతో ముగిసిపోతుంది. తర్వాత కేంద్ర రక్షణశాఖలో రిపోర్ట్ చేయాలి. కానీ ఆయనను ఇక్కడే ఉంచాలని.. డిప్యూటేషన్ పొడిగించాలని ఏపీ ప్రభుత్వం అదే పనిగా కేంద్రానికి విజ్ఞుప్తులు చేస్తోంది.

ప్రస్తుతం ఈ ఫైల్ ప్రధానమంత్రి కార్యాలయంలో ఉంది. ఆయన అంగీకరించకపోయినా… అంగీకరించడం ఆలస్యం అయినా ధర్మారెడ్డి టీటీడీ నుంచి వైదొలగాలి. ఒక వేళ పీఎంవోలో అభ్యంతరం వ్యక్తం అయితే్.. అవసరమైతే ధర్మారెడ్డిని కేంద్ర సర్వీసులకు రాజీనామా చేయించి రాష్ట్రంలో ఐఏఎస్ హోదా ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఓ ఉత్తరాది రాష్ట్రంలో ఇలా చేశారని ఓ కేస్ స్టడీని ఇప్పటికే బయటకు తీశారు. ఆ ప్రకారం.. తాము చేయాలని అనుకుంటున్నారు . ధర్మారెడ్డికి ఇంకా రెండేళ్లకుపైగా సర్వీస్ ఉంది. అంటే వైసీపీ సర్కార్ ఉన్నంత కాలం ఆయన ఈవోగా ఉంటారు. అందుకే… పదవిని వదులుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారని అంటున్నారు.

అయితే ఆయన పూర్తిగా కేంద్ర సర్వీసుల ఉద్యోగి, ఆయన అక్కడ రాజీనామా చేస్తే ఏపీ క్యాడర్‌కు ఎలా వస్తారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఐపీఎస్, ఐఏఎస్‌లు అయితే రాష్ట్ర క్యాడర్ ఉంటుంది. రక్షణ శాఖ ఉద్యోగులకు రాష్ట్ర క్యాడర్ ఉంటుందా అన్నదానిపై స్పష్టత లేదు. ఎలాగైనా ధర్మారెడ్డిని టీటీడీలోనే ఉంచాలని ప్రభుత్వం చేయాల్సినదంతా చేస్తోంది. రెడ్డి కోసం ఇంత పట్టుదలకు పోవడం చాలా సార్లు జరిగిందని .. ఇదంతా సహజమేనని ప్రభుత్వ వర్గాలు తేలిగ్గా తీసుకుంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close