బైబిల్, ఖురాన్, భగవద్గీత వల్ల బతుకులు మారలేదు.. రాజ్యాంగం వల్ల దళితుల బతుకులు మారాయి.. అని టీటీడీ బోర్డు సభ్యుడు, టీడీపీ దళిత ఎమ్మెల్యే ఎంఎస్ చేసిన వ్యాఖ్యలను అడ్డం పెట్టుకుని వైసీపీ చలి కాచుకునే ప్రయత్నం చేసింది. ఆయన భగవద్గీతను అవమానించారంటూ.. టీటీడీపై దాడి చేయడానికి సదా రెడీగా ఉండే.. భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. ఇక వైసీపీలో ఉండే చోటా మోటా నేతలంతా.. వీడియోలు చేశారు. చివరికి బీజేపీ నేత..మరో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఎంఎస్ రాజు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మొంథా తుపాను బాధితకు రిలీఫ్ చర్యలపై దృష్టి మళ్లించి తన వ్యాఖ్యలతో మత రాజకీయాలు చేయాలనుకుంటున్నారని గుర్తించిన ఎంఎస్ రాజు వెంటనే స్పందించారు. రాజ్యాంగం గొప్పతనం చెప్పాను కానీ.. మత గ్రంథాలను అవమానించలేదని అయినా ఎవరినైనా ఆ మాటలు నొప్పించి ఉంటే తాను క్షమాపణ చెబుతానని ప్రకటించారు. ఇదే అదనుగా వైసీపీ నేతలు ఎంఎస్ రాజును క్రిస్టియన్ ప్రచారం చేయడం ప్రారంభించారు. దళితులందర్నీ క్రిస్టియన్లు మార్చేందుకు కుట్ర పన్నారేమో కానీ.. ఆయన మాత్రం కరుడుగట్టిన హిందువు.
ఆ విషయం అనంతపురంలో.. మడకశిరలో అందరికీ తెలుసు. దళిత వాడల్లో ఐదు వేల ఆలయాల నిర్మించాలన్న ఆలోచన ఎంఎస్ రాజుదే. టీటీడీ బోర్డు కూడా దానికి ఆమోదం తెలిపింది. అయితే ఆయనను క్రిస్టియన్ చెప్పి.. సభ్యుడిగా తొలిగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు పనికొచ్చే పనులు చేయకుండా.. వైసీపీ నేతలు ఇలాంటి రాజకీయాలు చేస్తూంటారు. తాను రోజూ బైబిల్ చదువుతానని చెప్పుకునే జగన్ మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తే ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. కానీ ఇప్పుడు ఎంఎస్ రాజు ఏమీ అనకపోయినా వివాదం సృష్టించే ప్రయత్నం చేశారు.
 
                                                 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
                                               
                                               
                                               
                                               
                                              
 
                                                   
                                                   
                                                   
                 
                 
                 
                 
                