“బెంజ్”ను సమర్థించుకోలేకపోతున్న రోజా !

చిన్న యాంకర్లే ఖరీదైన కార్లు కొనుక్కుంటున్నారు..నేను కొనుక్కుంటే తప్పా ? అని వాదిస్తున్నారు కానీ .. బెంజ్ కారుకు రూ. కోటిన్నర ఎక్కడి నుంచి వచ్చిందో మాత్రం రోజా చెప్పడం లేదు. కొద్ది రోజుల కిందట కుమారుడికి పుట్టిన రోజు కారణంగా రూ. కోటిన్నర విలువైన బెంజ్ కారును గిఫ్టుగా కొన్నిచ్చారు. ఆ వీడియోను సోషల్ మీడియాలోనూ వైరల్ చేసుకున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా… ఆమె మంత్రి అయిన తర్వాతే ఇలా ఖరీదైన కారు కొనుగోలు చేయడం దుమారం రేపుతోంది.

పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈ ఆరోపణలను జనసేన నేతలు ఎక్కువగా చేస్తున్నారు. వారిపై రోజా మండిపడుతున్నారు. దీంతోీ విషయం హైలట్ అవుతోంది. తాను జబర్దస్త్‌లో లక్షల రెమ్యూనరేషన్లు తీసుకున్నానని..150 సినిమాల్లో హీరోయిన్‌గా చేశానని.. చెబుతున్నారు. కానీ ఆమె హీరోయిన్‌గా చేసింది జమానా కింద.. అప్పట్లో ఆమె నిర్మాతగా మారి.. సంపాదించుకున్నది కాకుండా.. సంపాదించుకోబోయేది కూడా పోగొట్టుకున్నదని చాలా మందికి తెలుసు.

అప్పుల పాలయ్యారని.. చెక్ బౌన్స్ కేసులు ఎదుర్కొన్నారని కూడా తెలుసు. అయితే తాను ఎప్పుడో హీరోయిన్ గా చేశానని ఇప్పుడు జబర్దస్త్ యాంకర్‌గా మానేసిన తర్వాత.. తన లక్షల్లో వస్తున్నాయని చెప్పి బెంజ్ కారు కొన్నానని చెప్పడం ఆమె వాదనలో పస లేదని.. చెబుతూ మరిన్ని ఆరోపణలు రావడానికి కారణం అవుతున్నారు. మొత్తానికి జనసేన నేతలు.. ఈ బెంజ్ విషయాన్ని ఇక్కడితో వదిలేలా లేరు. పెద్ద వివాదమయ్యేలానే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

గుంటూరు కారం: త్రీడీలో క‌నిపించిన బీడీ

https://www.youtube.com/watch?v=V-n_w4t9eEU&feature=youtu.be ముందు నుంచీ అనుకొంటున్న‌ట్టే.. మ‌హేష్ బాబు - త్రివిక్ర‌మ్ సినిమాకి 'గుంటూరు కారం' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సూప‌ర్ స్టార్ కృష్ణ జ‌యంతి సంద‌ర్భంగా ఈ రోజు ఫ‌స్ట్ గ్లిమ్స్ విడుద‌ల...

కేశినేనికి దారి తెలీడం లేదా ?

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తనను తాను ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నారు. బెజవాడను తిరుగులేని విధంగా అభివృద్ధి చేశానని.. టాటా ట్రస్ట్ అంటే తనదేనన్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఇండిపెండెంట్ గా...

‘గుహ’ క‌డుతున్న ప్ర‌భాస్‌

డ్రీమ్ హౌస్‌.. అంటూ ప్ర‌తీ ఒక్క‌రికీ ఉంటుంది. త‌మ ఇల్లు ఎలా ఉండాలో.. ముందు నుంచీ క‌ల‌లు కంటుంటారు. అలాంటి క‌ల ప్ర‌భాస్‌కీ ఉంది. అత్యాధునిక హంగుల‌తో ఓ ఫామ్ హౌస్ నిర్మించుకోవాల‌ని...

తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు కేంద్రం కూడా రెడీ !

తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఎవరూ ఊహించని విధంగా .. అత్యంత కాస్ట్ లీగా నిర్వహించడానికి తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేసింది. మరోసారి మన తెలంగాణ .. అనే సెంటిమెంట్ అందరిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close