పాతపట్నం వైకాపా ఎమ్మెల్యే వికెట్ డౌన్

వైకాపా ప్రధాన కార్యాలయం లోటస్ పాండ్ లో మొన్న జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమావేశానికి ఏడుగురు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. వారు వ్యక్తిగత పనులు కారణంగా రాలేకపోయారని కనుక వారు పార్టీ మారుతున్నట్లు ఊహాగానాలు చేయవద్దని వైకాపా సీనియర్ నేత ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మీడియాకి విజ్ఞప్తి చేసారు. అయితే నిప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా, ఆ ఎమ్మెల్యేలకి పార్టీ మారే ఉద్దేశ్యమే లేకుంటే వారు తమ పార్టీ అధినేత నిర్వహిస్తున్న ముఖ్యమయిన ఆ సమావేశానికి ఎందుకు హాజరు కాలేకపోయారో మీడియా ముందుకు వచ్చి చెప్పి ఉండాలి లేదా మీడియాలో తమ గురించి వస్తున్న ఊహాగానాలను ఖండించి ఉండాలి. వారిలో ఒకరిద్దరు మినహా మిగిలినవారు ఆ వార్తలను పట్టించుకోలేదు. అంటే ఆ ఊహాగానాలను దృవీకరిస్తున్నట్లే భావించవలసి ఉంటుంది.

జగన్ నిర్వహించిన సమావేశానికి హాజరు కాని వారిలో శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకట రమణ కూడా ఒకరు. తాజా సమాచారం ప్రకారం ఆయన తెదేపాలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని అందుకు మార్చి4వ తేదీకి ముహూర్తం కూడా పెట్టుకొన్నట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమావేశానికి హాజరుకాని వారిలో వైకాపా ఎమ్మెల్యేలు బలనాగి రెడ్డి (మంత్రాలయం), కె.సర్వేశ్వర రావు (అరుకు), సాయి ప్రసాద రెడ్డి (అధోని) కూడా ఉన్నారు. వారు కూడా మూటాముల్లె సర్దుకొంటున్నట్లు సమాచారం.

మార్చి 5నుండి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మొదలుకాబోతున్నాయి. ఈసారి సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని జగన్మోహన్ రెడ్డి నిశ్చయించుకొన్నారు. కానీ అంతకంటే ముందే చాలా మంది వైకాపా ఎమ్మెల్యేలు తమ పార్టీ అధ్యక్షుడు మీదే అవిశ్వాసం ప్రకటించేసి తెదేపాలో చేరిపోతున్నారు. ఈ పార్టీ ఫిరాయింపుల కారణంగా ఈసారి అసెంబ్లీ సమావేశాలలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద యుద్దమే జరిగే అవకాశాలు కనబడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బాక్‌: ఎన్టీఆర్ కృష్ణ‌ల ‘కురుక్షేత్ర‌’ యుద్ధం

ఒకేరోజు.. రెండు సినిమాలు, అందునా స్టార్ సినిమాలు విడుద‌ల కావ‌డం కొత్తేం కాదు. కానీ.. రెండూ ఇంచుమించుగా ఒకే క‌థ‌తో విడుద‌లైతే, రెండూ ఒకే జోన‌ర్ అయితే.. ఎలా ఉంటుంది? ఆ...

రానా పెళ్లిలో… ప్ర‌భాస్ ‘బావ‌’ మిస్సింగ్‌

శ‌నివారం రాత్రి రానా -మిహిక‌లు అగ్ని సాక్షిగా ఒక్క‌ట‌య్యారు. లాక్ డౌన్, క‌రోనా గొడ‌వ‌లు లేక‌పోతే, ఈ పెళ్లి ధూంధామ్‌గా జ‌రిగేది. కానీ లాక్ డౌన్ ప‌రిమితుల వ‌ల్ల కేవ‌లం 50మంది అతిథుల‌కే...

అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షలు : జగన్

విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య పదకొండుకు చేరింది. అందరూ... కోవిడ్ రోగులే. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. దాదాపుగా యాభై మంది కోవిడ్ రోగులు ఆస్పత్రిలో ఉండగా.....

నాని సినిమాని సీక్వెల్ వ‌స్తోంది

వాల్ పోస్ట‌ర్ బ్యాన‌ర్ స్థాపించి 'అ' సినిమాతో బోణీ కొట్టాడు నాని. నిర్మాత‌గా త‌న అభిరుచి ఎలాంటిదో తొలి సినిమాతోనే చూపించాడు. ప్ర‌శాంత్ వ‌ర్మ‌ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేశాడు. 'అ' క‌మర్షియ‌ల్ గా...

HOT NEWS

[X] Close
[X] Close