సినిమా వాళ్లు బలిసికొట్టుకుంటున్నారంటున్న వైసీపీ ఎమ్మెల్యే!

ఏపీ ప్రభుత్వం ఎంత వేధించినా భరిస్తున్న సినిమా వాళ్లంటే వైసీపీ నేతలకు అలుసైపోయింది. టాలీవుడ్ అంటే ఎంత చులకన అయిపోయిందంటే.. చివరికి వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. నేరుగా సినిమా వాళ్లు బలిసికొట్టుకుంటున్నారంటూ విమర్శించేశారు. ఇంత గా ఎందుకు తిట్టాల్సి వచ్చిందో అసలు టాలీవుడ్‌… కోవూరు ఎమ్మెల్యేకు ఏంటి సంబంధమో ఎవరికీ తెలియదు. కానీ వైసీపీ ఎమ్మెల్యే కాబట్టి ఎవర్నైనా.. ఎలాగైనా తిట్టవచ్చనే హక్కు ఉందని ఆయన పీలయ్యాడు. ఉపయోగించుకున్నారు.

అసలు సినిమా వారికి ఏపీ అంటే గుర్తుందా? … టిక్కెట్ రేట్లు తగ్గిస్తే సామాన్యులు కూడా సినిమాలు చూస్తారని, ప్రభుత్వ నిర్ణయంలో తప్పేంటని ఆయన ఎదురుదాడి చేస్తున్నారు. నల్లపురెడ్డి కొద్ది రోజుల కిందట… ఏపీలో వరదలు వస్తే సినీ హీరోలు విరాళాలు ప్రకటించలేదని సినీ తారలను తిట్టారు. ఇప్పుడు మరోసారి టిక్కెట్ల అంశంపై తిట్టారు. టాలీవుడ్ అంటే ఇష్టారీతిన తిట్టినా పడి ఉంటారన్న భావనకు వైసీపీ ఎమ్మెల్యేలు వస్తున్నారు.

టాలీవుడ్‌లో ఐక్యత లేకపోవడంతో వల్ల..ఎవరికి వారు తమను కాదని అని దులిపేసుకుని వెళ్లిపోతున్నారు. చివరికి నాగార్జున లాంటి వారు టిక్కెట్ రేట్లతో తమకేమీ ఇబ్బంది లేదని చెప్పడం ద్వారా … టాలీవుడ్ ను మరింత పలుచన చేశారు. అలాంటి పరిస్థితులే ఉంటే ఇక నల్లపురెడ్డి లాంటి వారు ఇవాళ బలిసి కొట్టుకుంటున్నారని తిట్టారు.. రేపు ఇంకొకరు.. భరించలేని విధంగా తిడతారు. ఎందుకంటే టాలీవుడ్ అంత అలుసైపోయింది మరి .!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close