జగన్ను పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారని వైసీపీ ఎమ్మెల్సీలు ఫీల్ అయ్యారు. శాసనమండలిలో చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అని పిలుస్తామని అతి రాజకీయం చేశారు. హోదా ప్రకారం రాజకీయంగా జగన్ వైసీపీ అధ్యక్షుడు అవుతారు. కానీ అసెంబ్లీ వరకూ ఆయన పులివెందుల ఎమ్మెల్యేనే. తనకు ప్రతిపక్ష హోదా లేదని జగన్ చెబుతున్నారు. ఎన్డీఏకు మద్దతు ప్రకటిస్తున్నారు. అధికారికంగా ఇప్పుడు ఆయనకు ఉన్న హోదా పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే.
కానీ జగన్ రెడ్డి హోదాను గుర్తు చేస్తే చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అంటామంటున్నారు. చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనకు ఉన్న అత్యున్నత పదవి పేరుతో ఆయనను గౌరవించాలి. అది ప్రోటోకాల్. అది కూడా తెలియకుండా.. జగన రెడ్డికి పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారని వారు ఫీల్ అవుతున్నారు. ప్రతిపక్ష నేతగా ఉంటే. కనీసం ప్రతిపక్ష నేత అని చెప్పేవారు. అది కూడా లేదు. జగన్ మాజీ ముఖ్యమంత్రి అని అలా పిలవాలని వారంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి.. లేదా.. విభజిత ఏపీ రెండో ముఖ్యమంత్రి అనే హోదాలు పార్టీ నేతలు పిలుచుకోవడానికి పనికొస్తాయి. అందరూ .. అదీ అధికారిక కార్యక్రమాల్లో ఆ హోదా పెట్టి పిలవరు. ఆ ప్రోటోకాల్ కూడా లేదు.
అయినా ఆయన కుటుంబానికి పులివెందుల కంచుకోట. దశాబ్దాలుగా పులివెందుల ప్రజలు వారికి పట్టం కడుతున్నారు. అలాంటప్పుడు పులివెందుల ఎమ్మెల్యే అంటే సంతోషపడాలి కానీ..అదేదో అవమానంగా ఎందుకు ఫీలవుతున్నారో ఎమ్మెల్సీలకూ అర్థం కావడం లేదు. కానీ పార్టీ ఆదేశాల ప్రకారం వారంతా మండలిలో రెచ్చిపోయారు. చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అంటామంటూ వికృతం చాటారు. ఆయన కుప్పం ఎమ్మెల్యే కానీ…సభా నాయకుడు అన్న సంగతిని మర్చిపోయారు.