మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు పెట్టనికోటగా మారిన అద్దంకి నియోజకవర్గానికి వైసీపీ ఇంచార్జ్ గా అశోక్ కుమార్ అనే వ్యక్తిని జగన్ నియమించారు. నియామక ప్రకటన వచ్చిన తర్వాత ఆయన ఎవరా అని అందరూ ఆరా తీశారు. ఆయన పిడుగురాళ్ల వద్ద జానపాడుకు చెందిన వైద్యుడు. పిడుగురాళ్లలో పల్నాడు ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. ఆయన సోదరుడు గురజాల నుంచి జనసేన తరపున ఓ సారి పోటీ చేశారు. గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఇప్పుడు సోదరుడు జనసేనలోనే ఉన్నారేమో కానీ ఈయన మాత్రం వైసీపీ ఇంచార్జ్ అయిపోయారు.
వైవీ సుబ్బారెడ్డికి బినామీగా ఉంటూ వ్యాపారాలు చేసుకునే పాణెం హనిమిరెడ్డి ఆయనను గత ఎన్నికల్లో అద్దంకి నుంచి పోటీకి నిలబెట్టి.. విపరీతంగా ఖర్చు పెట్టించారు. గొట్టిపాటి రవిపై గెలవాలంటే తప్పదని మొహమాట పెట్టారు. ఏం చేసినా గెలవలేకపోయాడు.. పైగా తర్వాత నుంచి కనిపించకుండా పోయాడు హనిమిరెడ్డి. నిజానికి ఆయనది అద్దంకి కాదు పెదకూరపాడు. ఇప్పుడు కూడా పల్నాడు నుంచే అద్దంకికి లీడర్ ను జగన్ వెదుక్కున్నారు.
ఇంచార్జులను నియమించే విషయంలో జగన్ ప్రత్యేక వ్యూహం అవలంభిస్తున్నారు. సామాజిక సమీకరణాల వల్ల వారికి టిక్కెట్ ఇచ్చే అవకాశం లేకపోయినప్పటికీ.. ఎన్నికల వరకూ వారితో డబ్బులు ఖర్చు పెట్టించేందుకు ఎక్కడ ఉన్నా.. క్యాష్ పార్టీలను చూసుకుంటున్నారు. బాగా ఖర్చు పెట్టగలిగే వారిని చూసుకుని టిక్కెట్లు ఇస్తున్నారు. అశోక్ కుమార్ ను పూర్తిగా నాకించేస్తారని.. ఇప్పటికే సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.