లోక్‌సభలో “వైసీపీ ఆర్” వర్సెస్ వైసీపీ

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఎదుర్కోవడం మిగతా వైసీపీ ఎంపీలకు కష్టమై పోతోంది. ఆయన ప్రెస్మీట్లు పెట్టకుండా చేయాల్సినదంతా చేసినా .. చివరికి దేశద్రోహం కేసు పెట్టినా ఆపలేకపోయారు. ఇప్పుడు పార్లమెంట్‌లోనూ ఆయన మాట్లాడుతూండటంతో అడ్డుకోలేకపోతున్నారు. సోమవారం లోక్‌సభ జీవో అవర్‌లో రఘురామకృష్ణరాజు మాట్లాడారు. రైతుల పాదయాత్రపై పోలీసుల దాడుల అంశాన్నిప్రధానంగా ప్రస్తావించారు. హైకోర్టు నుంచి అనుమతులు ఉన్నా పోలీసులు అడ్డుకోవడం దురదృష్టకరమని … రాజధాని కోసం 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన వారిని తీవ్రంగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమైనా … క్షీణించాయి కాబట్టి లో్‌సభలో చెప్పక తప్పడం లేదన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కూడా పోలీసులు హరిస్తున్నారని రఘురామ సభ దృష్టికి తీసుకెళ్లారు. రఘురామను ఎలా ఆపాలో తెలియక వైసీపీ ఎంపీలు తంటాలు పడ్డారు. లోక్‌సభా పక్ష నేత మిథున్ రెడ్డి.. సభలో రఘురామపై రాజకీయ విమర్శలు చేశారు. సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

రఘురామపై ఉన్న సీబీఐ కేసులపై వేగంగా దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు. వెంటనే రఘురామ కూడా కౌంటర్ ఇచ్చారు. తనపై రెండే సీబీఐ కేసులు ఉన్నాయని. .. మీ నాయకుడిపై వంద కేసులున్నాయని.. వాటి సంగతి ముందు తేల్చాలన్నారు. వైసీపీ ఎంపీలు పరస్పరం తమ కేసుల గురించి చెప్పుకోవడం.. ఇతర పార్టీలు.. రాష్ట్రాల సభ్యులను ఆశ్చర్య పరిచింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ హైకమండ్‌లోనూ “ఐప్యాక్‌”పై అసంతృప్తి !

తెలంగాణ సీఎం కేసీఆర్ ఐ ప్యాక్‌ ను తెలంగాణ నుంచి వెళ్లగొట్టారు. గతంలో గొప్పగా పొగిడారు కానీ ప్రత్యక్షంగా వారి సర్వీసులు అందుకున్న తరవాత... తమ నెత్తి మీద తాము చేయి...

రాజకీయ ప్రవేశంపై ఖండించని వైఎస్ సునీత !

వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె .. తన తండ్రి హత్య కేసులో న్యాయం కోసం విస్తృతంగా శ్రమిస్తున్నారు. సొంత కుటుంబంలోనే అత్యంత బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటున్నారు. అయినా వెనక్కి తగ్గడం లేదు. సుప్రీంకోర్టు వరకూ...

చెట్టు కొట్టి మీదేసుకునే బాపతు కాంగ్రెస్..రాజస్థానే సాక్ష్యం!

ఏదైనా కాంగ్రెస్ పార్టీ సింపుల్‌గా చేద్దామనుకుంటుంది. కానీ చినిగి చేటంతవుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఒకే ఒక్కపెద్ద రాష్ట్రం రాజస్తాన్. గతంలోనే సచిన్ పైలట్ తిరుగుబాటుతో ప్రభుత్వం కూలిపోతుందన్న పరిస్థితి ...

జగన్ ఫ్యాక్షన్ పై జగ్గారెడ్డి సెటైర్లు

మూడు రాజధానులు అంటే సమర్థిస్తున్నవారు ఏపీలోనే కొంత మంది ఉంటారు కానీ బయట ఎవరూ లేరు. ఎక్కువ మంది నవ్వుతున్నారు. అలాంటి వారి జాబితాలో తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close